Best Online Learning Websites For Students

Best Websites to Take Free Online Courses:

చదువుకుంటూనో లేక ఉద్యోగం చేస్తూనో కొత్త కొత్త స్కిల్స్ ని నేర్చుకోవాలని , లేక ఉన్న స్కిల్స్ ని మెరుగుపరుచుకోవాలని చాల మంది అనుకుంటారు. కానీ సమయం సరిపోక, లేక బయట కోచింగ్ సెంటర్లలో ఫీజులు ఎక్కువగా ఉండడం వలన గాని ఆ ఆలోచన పక్కన పెట్టేస్తారు. అటువంటి వారికి కొన్ని websites అందిస్తున్న ఈ Online Course లు ఎంతగానో ఉపయోగపడతాయి.

దాదాపుగా ఆన్ లైన్ లో చాలా కోర్స్ లు ఫ్రీగా లభిస్తున్నాయి. అలాగే కొన్ని కోర్స్ చాల తక్కువ ఫీజుతో కూడా లభిస్తాయి. అంతేకాదు మీరు ఒక్కసారి కోర్స్ కొనుక్కుంటే మీకు ఎప్పుడు కావాలన్నా తిరిగి చూసుకోవచ్చు.
అంతేకాదు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు కంప్యూటర్ లో గాని లేదా మొబైల్ ద్వారా ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు.
అందుకే ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ కోర్స్ ల ద్వారా నేర్చుకునేవారి సంఖ్య బాగా పెరిగింది.

ఆన్ లైన్ లో కోర్స్ లు అందిస్తున్న కొన్ని మంచి website ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా కోర్స్ లో చేరే ముందు ఆ కోర్స్ కి ఉన్న రేటింగ్ చూసి,రివ్యూ లు చదివి మంచి కోర్స్ లో చేరండి.

1. edx:

best websites to learn online course in telugu

edx అనేది non-profit open-source educational platform. హార్వర్డ్ , MIT , బ్రిటిష్ కొలంబియా వంటి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గొప్ప గొప్ప యూనివర్సిటీలకు చెందిన కోర్స్ లు ఈ వెబ్ సైట్ లో ఉచితంగా లభిస్తాయి. కానీ మీకు సర్టిఫికెట్ కావాలనుకుంటే మాత్రం కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది.ఈ website లో Architecture, Business & Management, Economics & Finance, Law, Music, Philanthropy ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కోర్స్ లు మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తో లభిస్తున్నాయి.

2. Codecademy:

best websites to learn online course in telugu

ఇది పూర్తిగా కోడింగ్ కి సంబందించిన వెబ్ సైట్. Software Course లు నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ Website ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో Python, Java, JavaScript, Ruby, SQL, and Sass,ఇలా సుమారుగా 12కు పైగా ప్రోగ్రామింగ్ languages ని ఫ్రీ గా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచెం డబ్బు చెల్లించి upgrade చేసుకుంటే మరిన్ని కోర్స్ లు పొందవచ్చు. అలాగే దీనిలో మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లైవ్ గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.అంతేకాకుండా మీ ప్రోగ్రెస్ ని కూడా ఎప్పటికపుడు మానిటర్ చేసుకోవచ్చు.

3. Coursera:

best websites to learn online course in telugu

ఈ website లో 29దేశాలకు చెందిన 147 కి పైగా గొప్ప గొప్ప కాలేజీ మరియు యూనివర్సిటీలకు చెందిన కోర్స్ లు లభిస్తాయి. దాదాపు కోర్స్ లు అన్నీకూడా ఫ్రీ గానే లభిస్తాయి కానీ కొన్నిటికీ మాత్రం ఫీజు చెల్లించాలి. కోర్స్ లో సబ్జెక్టు కూడా చాల లోతుగా ఉంటుంది . దీనిలో 2000+ (2018నాటికి )కిపైగా కోర్స్ లు ఉన్నాయి. దీనిలో పొందిన సర్టిఫికెట్స్ ని మీరు రెసుమె లో కూడా చేర్చుకోవచ్చు.

4. Udemy:

best websites to learn online course in telugu

దాదాపు అన్ని టాపిక్ లకు సంబంధించిన కోర్స్ లు ఈ website లో లభిస్తాయి. కొన్ని కోర్స్ లు మన తెలుగు భాషలో కూడా ఉంటాయి దీనిలో మీరు కోర్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు మంచి రేటింగ్, రివ్యూస్ ఉన్న కోర్స్ ని చూసుకుని చేరండి. ఒకవేళ మీరు కూడా ఏదో ఒక సబ్జెక్టు లో నిష్ణాతులైతే మీరు కూడా ఒక కోర్స్ create చేసి దానిని udemy లో అప్లోడ్ చేసి మనీ సంపాదించవచ్చు.
దీనిలో paid కోర్స్ లతో పాటుగా కొన్ని ఫ్రీ కోర్స్ లు కూడా ఉంటాయి. ఈ website లో కోర్స్ ధర 10 డాలర్ల నుండి 500 డాలర్ల వరకు ఉంటాయి. అంతేకాదుఎప్పటికప్పుడు ఈ వెబ్ సైట్ ఈ paid course ల మీద ఆఫర్స్ ని ప్రకటిస్తుంది. అటువంటి సమయంలో ఆ కోర్స్ లు చాల తక్కువ ధరకి లభిస్తాయి.

5. Khan academy:

దీనిలో 5 తరగతి నుండి IIT-JEE వరకు అన్ని క్లాస్ లకు సంబంధించిన lessons వీడియోల రూపంలో లభిస్తాయి. సైన్స్, మాథ్స్ , ఎకనామిక్స్ ఇలా అన్ని విభాగాలకు సంబందించిన అన్ని సబ్జెక్టు లు ఈ Khan academy లో ఉంటాయి. ఇందులో అన్ని కూడా పూర్తిగా ఉచితం. Free గా world-class education అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని స్టార్ చేసారు.

ఇవే కాకుండా

Alison
Udacity
Teamtreehouse
W3Schools
Lynda
Skillshare
TedEd

ఇవన్నీ కూడా Online ద్వారా మంచి కోర్స్ లు అందిస్తున్న వెబ్ సైట్లు.

You may like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

What is IQ in Telugu-ఐ.క్యూ అంటే ఏమిటి?

Please Share With Your Friends : )

14 thoughts on “Best Online Learning Websites For Students

 • October 2, 2018 at 2:21 am
  Permalink

  Thanks Anna for your help nenu Dani gurinche adugudam anukunna

  Reply
 • October 2, 2018 at 3:14 am
  Permalink

  Bro nuvu roju e lanti matters pettu appudu neku traffic peruguthudi
  Nuvu weakly okatie pedithe YT LA ekkada traffic radu bro

  Reply
  • October 2, 2018 at 9:28 am
   Permalink

   ok bro

   Reply
  • October 16, 2018 at 6:29 am
   Permalink

   Sir , timetable ala prepare cheyalo inka ala follow avvali chepandi sir please .mi videos Chala inspire chestundi please continue like that.tq

   Reply
 • October 2, 2018 at 5:23 pm
  Permalink

  Nice websites sir…thank you..keep it up

  Reply
 • October 3, 2018 at 4:17 am
  Permalink

  ok bro but videos kuda tvraga chey anna.. tnq

  Reply
 • October 3, 2018 at 9:43 am
  Permalink

  brother nuvvu chala great i am really proud of you

  Reply
  • October 3, 2018 at 12:43 pm
   Permalink

   Thank you 🙂

   Reply
 • October 6, 2018 at 5:49 pm
  Permalink

  Baku telisina jenios unadante athanu nuvve bro I’m really proud of u

  Reply
 • October 7, 2018 at 2:36 am
  Permalink

  adukuani annam oka roju agina thruvatha nru vachudi

  Reply
 • October 15, 2018 at 2:26 pm
  Permalink

  Plz make video free study in usa university for you Indian student

  Reply
 • October 16, 2018 at 5:53 am
  Permalink

  thanks for saying now iam learning coding using codeacademy.thank you very much for suggesting website.ALL THE BEST !!

  Reply
 • October 28, 2018 at 4:18 pm
  Permalink

  It was the best for ever !ever, ever and eeevvvveeerrrr!!!!!!

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial