Black Hole in Telugu-బ్లాక్ హోల్ అంటే ఏమిటి?-Telugu Badi

What is a Black Hole in Telugu:

ఈ విశ్వం ఎలా పుట్టింది, ఎలా పరిణామం చెందింది అనేది ఇప్పటికి అంతుచిక్కని రహస్యంగానే ఉంది. అలాగే ఈ విశ్వం లో మరొక అతి పెద్ద మిస్టరీ ఏంటంటే ..
(Black Hole) బ్లాక్ హోల్. తెలుగులో దీనిని కృష్ణ బిలం అని అంటారు. ఎంత పెద్ద గ్రహాలైన నక్షత్రమైన సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు . ఒక్కసారి ఈ బ్లాక్ హోల్ లోకి ఏదైనా సరే వెళ్లిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు . తన దరిదాపుల్లోకి వచ్చిన దేనినైనా సరే క్షణాల్లో మింగేస్తుంది . ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని(Light ) కూడా తన వైపు తిప్పుకోగలదు.

 

బ్లాక్ హోల్ (Black Hole) ఎలా ఏర్పడుతుంది?

బ్లాక్ హోల్ గురించి అర్ధమవ్వాలంటే ముందు నక్షత్రం గురించి తెలుసుకోవాలి. ఒక నక్షత్రం కాంతివంతం గా వెలుగుతూ , శక్తిని విడుదలచెయ్యడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజెన్. ఈ హైడోజెన్ atom లు కలిసి హీలియం గా మారడం వల్ల అంటే న్యూక్లియర్ ఫ్యూషన్ (Nuclear Fusion) జరగడం వల్ల విపరీతమైన ఎనర్జీ , రేడియేషన్ విడుదలవుతుంది. ఒకవైపు విడుదలయిన ఈ ఎనర్జీ కోర్ నుండి అంటే నక్షత్రం మధ్య భాగం నుండి బయటకు వెళ్తుంటే …మరొక వైపు నక్షత్రానికి ఉన్న ఆకర్షణశక్తి (Gravitation) దీనిని నక్షత్రం మధ్య భాగానికి నొక్కి పెట్టి ఉంచుతుంది. ఈ విధంగా రెండు బలాలు(Force) ఒకేసమయంలో వ్యతిరేకంగా పనిచేస్తుండడం వల్ల ఒక నక్షత్రం స్థిరం(stable) గా ఉంటుంది .

కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఇలా మండుతూ ఉన్న నక్షత్రంలో కొంతకాలానికి హైడ్రోజెన్ అయ్యిపోతుంది. ఎప్పుడైతే నక్షత్రం లో హైడ్రోజెన్ తగ్గిపోతుందో అప్పుడు అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడం తో ఎనర్జీ విడుదలవ్వదు. దాంతో కోర్ కి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్(Gravitational Force) కారణంగా అంత పెద్ద నక్షత్రం దానికదే దగ్గరకంటూ చేరిపోయి చిన్న బంతిలా మారిపోతుంది . దానితో నక్షత్రంలోని సాంద్రత(denisty) ఎక్కువయ్యి అక్కడ వత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఆ నక్షత్రం పేలిపోతుంది. దీనినే సూపర్ నోవా ఎక్సప్లోషన్ ( Supernova Explosion) అని అంటారు.

పేలుడు జరిగిన నక్షత్రం చిన్నదైతే అది న్యూట్రాన్ స్టార్ గా మారుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్ కి విపరీతమైన సాంద్రత(Density) ఉంటుంది ఎంత అంటే ఒక టీ స్పూన్ పరిమాణం ఉన్న న్యూట్రాన్ స్టార్ బరువు ఈ భూమి మీద సుమారుగా 10 మిలియన్ టన్నుల బరువు ఉంటుంది. లేదా ఒకవేళ ఆ నక్షత్రం పెద్దయి అయితే ఆ విస్ఫోటనం తర్వాత అది బ్లాక్ హోల్ (Black Hole) గా మారుతుంది. వీటికి విశ్వంలోనే అత్యంత ఎక్కువ ఆకర్షణ శక్తి (Gravitational Force) ఉంటుంది. ఇలా చనిపోయిన ఈ నక్షత్రలే బ్లాక్ హోల్ గా మారతాయి.

అయితే చనిపోయిన నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్ గా మారవు. ఎందుకంటే బ్లాక్ హోల్ గా మారాలంటే నక్షత్రం సైజు ఇప్పుడున్న మన సూర్యుడికన్నా 20 రెట్లు పెద్దదిగా ఉంటేనే అది చనిపోయిన తరువాత బ్లాక్ హోల్ అవుతుంది. అంటే మన సూర్యుడు(Sun) బ్లాక్ హోల్ గా మారే అవకాశం లేదు.

బ్లాక్ హోల్ వల్ల మన భూమికి ప్రమాదం ఉందా?

మనం ఉన్నటువంటి పాలపుంత(Milk Way)లో కూడా ఒక బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు Sagittarius A*. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే దీని వ్యాసం(Diameter) 4కోట్ల 40 లక్షల కిలోమీటర్లు అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. కానీ ఇది మన భూమికి 25,640 లైట్ years దూరంలో ఉంది.

ఒక లైట్ ఇయర్ (Light Year) అంటే .. లైట్ ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అలాంటిది ఒక సంవత్సర కాలంలో ఎంతదూరం ప్రయాణిస్తుందో .. ఆ దూరాన్ని లైట్ ఇయర్ (Light Year) అని అంటారు. అంటే ఒక లైట్ ఇయర్ సుమారుగా 94,60,52,80,00,000 km 9 లక్షల 46 వేల కోట్ల కిలోమీటర్ల దూరంతో సమానం. అలాంటిది Sagittarius A* మన భూమికి 25,640 లైట్ years దూరంలో ఉంది. కాబట్టి దీని గురించి మనం భయపడవలసిన లేదు.

 

బ్లాక్ హోల్ ని ఎలా గుర్తిస్తారు?

ఇప్పటివరకు ఎవరూ కూడా ఈ బ్లాక్ హోల్ ని చూడలేదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ (Reflect) అయితే మన కంటికి ఆ వస్తువు కనపడుతుంది. కానీ బ్లాక్ హోల్ ఆ కాంతిని కూడా ఆకర్షించేసుకోవడం వల్ల బ్లాక్ హోల్ మనకు కనబడవు. మరి ఈ బ్లాక్ హోల్ ఉన్నట్టు ఎలా గుర్తిస్తారంటే బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేదా ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్ లో కలిసిపోతున్నప్పుడు ఎక్కువ కాంతి వంతంగా వెలుగుతూ x కిరణాలను విడుదలచేస్తాయి . ఇలా నక్షత్రాల కదలిక మరియు కాంతి ని బట్టి అక్కడ బ్లాక్ హోల్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు.

బ్లాక్ హోల్ లోకి వెళ్తే ఏమవుతుంది?

ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ event horizon అనే ఒక ఏరియా ఉంటుంది. ఏదైనా సరే ఈ event horizon బయట ఉన్నంత వరకు పరవాలేదు కానీ దానిని దాటి లోపలకి వెళ్లిందా తిరిగి బయటకు రావడం అసాధ్యం. ఈ ఏరియా లోకి ఏదైనా వెళ్తే అత్యంత వేగంతో తిరుగుతూ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతుంది

ఈ బ్లాక్ హోల్ మధ్యలో కాలం(Time) చాల నెమ్మదిగా గడుస్తుంది. విశ్వంలో ఎక్కడైనా సరే ఫిజిక్స్ సూత్రాలు(Physics Laws) వర్తిస్తాయి. కానీ ఈ బ్లాక్ హోల్ లో మాత్రం ఇవి పనిచేయవు అసలు ఈ బ్లాక్ హోల్ లో ఏముంటుంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికి ఎవ్వరికి తెలియదు .

అయితే కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ బ్లాక్ హోల్ లో అనేది రెండు యూనివర్స్(Universe) లను కలిపే ఒక మార్గమని కొంతమంది వాదన . ఈ బ్లాక్ హోల్ లో వెళ్తే warm hole అనబడే ఒక మార్గం ద్వారా మరొక యూనివర్స్ లోకి చేరుకోగలమని ఈ బ్లాక్ హోల్ లో టైం ట్రావెలింగ్ కూడా చెయ్యవచ్చని కొంతమంది అభిప్రాయం

ఒకవేళ ఒక మనిషి event horizon దాటి లోపలకు వెళ్తే అక్కడున్న ఆకర్షణ శక్తి (Gravitational Force) కారణంగా శరీరం మొత్తం ఒకేసారి కాకుండా మెల్లగా సాగపోయి చిన్న చిన్న ముక్కలుగా వేరై బ్లాక్ హోల్ లో కలిసిపోవడం జరుగుతుంది.

బ్లాక్ హోల్స్ కి అంతం ఉంటుందా?

ఈ విశ్వంలో పుట్టిన ప్రతిదానికి చావు ఉంటుంది. అలాగే బ్లాక్ హోల్స్ కి కూడా. బ్లాక్ హోల్స్ కి కూడా అంతం ఉంటుదని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(Stephen Hawking) ప్రతిపాదించారు. బ్లాక్ హోల్ నుండి నిరంతరం రేడియేషన్ విడుదలవుతుంది. దీనినే Hawking Radiation అని అంటారు. దానితో బ్లాక్ హోల్ తన మాస్(Mass),ని (Energy)ఎనర్జీ ని కోల్పోతుంటాయి. ఒకవేళ ఈ బ్లాక్ హోల్స్ లోకి ఏమి వెళ్లకపోతే కొంత కాలానికి మెల్ల మెల్లగా దాని సైజు తగ్గిపోయి చివరకు eveaporate అయ్యిపోతాయి. కానీ దీనికి చాల సంవత్సరాలు పడుతుంది.

ఎంత అంటే ఒక బ్లాక్ హోల్ తన సైజు లో 0.0000001 % తగ్గాలంటే 10,000 బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ ల సంవత్సరాలు పడుతుంది. అలాంటిది బ్లాక్ హోల్ పూర్తిగా అంతరించి పోవాలంటే ఎంత కాలం పడుతుందో ఊహించుకోండి.

Watch on YouTube: Black Hole Explained in Telugu

 

You may like:

TRP రేటింగ్ అంటే ఏమిటి? 

A.P.J Abdul Kalam Inspirational Quotes

 

Please Share with Your Friends : )

6 thoughts on “Black Hole in Telugu-బ్లాక్ హోల్ అంటే ఏమిటి?-Telugu Badi

 • September 30, 2018 at 2:07 am
  Permalink

  Brother please Russian

  గురించి నాకు కాస్త తెలియజేయండి ప్లీజ్

  మరియు అలాగే అమెరికా.. గురించి కూడా

  Reply
 • October 2, 2018 at 6:58 am
  Permalink

  Sir can you plz upload a video on what is satellite , purpose of satellite and uses

  Reply
 • October 3, 2018 at 2:45 pm
  Permalink

  Good information brother.thank you.🙂👌👍❤️🙏

  Reply
 • October 10, 2018 at 9:41 am
  Permalink

  Aliens are really exists or not

  Reply
 • October 17, 2018 at 8:57 am
  Permalink

  Brother plz make a biography on Henry Fischel – who invented exams.

  Reply
 • January 10, 2019 at 10:33 am
  Permalink

  in leap year why it should be february 29 why not some other day

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial