How to Improve Your Eye Sight Naturally? in Telugu

కంటి చూపును మెరుగుపరచుకోవడం ఎలా?

పూర్వకాలంలో ముసలి వయసు వచ్చిన తరువాత చూపు మందగించడం వలన కళ్ళజోడు వాడేవారు. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొంతమంది పిల్లలకు సైట్ (Eye Sight) వచ్చేస్తుంది. రోజురోజుకి కళ్లజోడు ధరించేవారి సంఖ్య పెరిగిపోతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వలన గాని ఈ కంటి చూపు అనేది మందగిస్తుంది. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ (Eye Sight) వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్దాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

 

పోషకాల లోపం:

మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహారాల గురించి క్రింద ఇవ్వడం జరిగింది. ఆ ఆహార పదార్దాలను విరివిగా తీసుకోండి.

1.)  మునగ ఆకులు: మనందరికి మునగ కాయ తెలుసు. వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది.

2.) విటమిన్ – సి (Vitamin- C) ఎక్కువగా ఉండే పళ్ళు అయినటువంటి నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

3.) వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్దాలు , క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

 

కంటి వ్యాయామాలు(Eye Excercises) :
మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన కంటికి కూడా అంతే అవసరం. ప్రతి రోజు కొద్దీ సేపు ఈ కంటి వ్యాయామాలు చెయ్యడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ఎప్పుడు సమయం ఉంటె అప్పుడు, ఏ ప్రదేశంలో అయినా సులువుగా ఈ వ్యాయామాలు చేసుకోవచ్చు. ఈ క్రింద చిత్రంలో చూపించిన విధంగా కళ్ళను కదుపుతూ ప్రతి రోజు కొంత సేపు కంటి వ్యాయామాలు చెయ్యండి.

eye-exercises-to-improve-eyesight

 

20-20-20 రూల్ ని పాటించండి:

మీరు ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారైతే మీ కళ్లు ఎక్కువగా అలసటకు గురవుతాయి. ఆ సమయంలో ఈ 20-20-20 రూల్ ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్ తీసుకుని కంప్యూటర్ ని కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడండి . ఇదే 20-20-20 రూల్. ఇది కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

పొగ త్రాగకండి: పొగ త్రాగడం అనేది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, జుట్టు, చర్మం, పళ్ళు చివరకు కళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. పొగ త్రాగే వారికి భవిష్యత్తులో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పొగ త్రాగకండి.

రాత్రి సమయంలో ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకండి. ఈ రోజుల్లో చాలా మంది చాటింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ రాత్రిపూట ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల మనకు తెలియకుండానే మన కళ్ళు ప్రమాదంలో పడుతున్నాయి. మన జీవితాంతం ఉండవలసిన మన కంటి చూపు కన్నా అవి ముఖ్యమైనవా? ఒకసారి ఆలోచించండి.

మీ ఉద్యోగంలో భాగంగా మీరు ఎక్కువగా కంప్యూటర్ ని ఉపయోగిస్తున్నట్లైతే కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ వలన కళ్ళు దెబ్బ తినకుండా ఉండడం కోసం Anti-Glare Glasses ని ఉపయోగించండి.

ప్రతి సంవత్సరం ఒక్కసారైనా కంటి పరీక్షలు చేయించుకోండి.

కాబట్టి పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మంచి ఆహారం తీసుకోవడం వలన సైట్ వంటి కంటి వ్యాధులు ఉన్నవాళ్లు కొంత వరకు తగ్గించుకోవచ్చు. లేనివారు భవిష్యత్తులో రాకుండా కాపాడుకోవచ్చు. అందరికి ఉపయోగపడే ఈ విషయాన్నీ మీ మిత్రులందరికి Share చెయ్యండి.

 

 

You May like:

Chanakya Quotes in Telugu

జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన కొన్ని పుస్తకాలు

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

 

Please Share with Your Frineds : )

4 thoughts on “How to Improve Your Eye Sight Naturally? in Telugu

 • March 6, 2019 at 3:01 am
  Permalink

  Bro how to use pan card and it is compulsory to link with bank ah .what are the advantage and disadvantage of pan and how to apply

  Reply
 • March 6, 2019 at 3:07 am
  Permalink

  night time blue light filter app use chesthay eyes ki manchidhi Ani na opinion
  Elanti apps playstore like vuntai
  Evi cell phone nunchi vachhay blue light nundi Mana eyes ni kapaduthai
  So use blue light filter app for night time friends

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial