Hubble Space Telescope in Telugu – Facts about Hubble

హబుల్ స్పేస్ టెలీస్కోప్ (Hubble Space Telescope):

అంతరిక్షంలోకి పంపబడిన మొట్ట మొదటి టెలిస్కోప్ ఇది. దీనిద్వారా ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలను, నక్షత్రాలను, గేలక్సీలను మనం పరిశీలించగలుగుతున్నాం, పరిశోధించగలుగుతున్నాం. అలా అంతరిక్షాన్ని శోధించడానికి మన శాస్త్రవేత్తలకు ఎంతగానో సహాయపడుతున్న ఈ హబుల్ స్పేస్ టెలీస్కోప్ (Hubble Space Telescope) గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1). హబుల్ స్పేస్ టెలీస్కోప్ ని April 24, 1990 న Discovery (STS-31)అనే Space shuttle ద్వారా లాంచ్ చేసి కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది.

2). ఈ హబుల్ స్పేస్ టెలీస్కోప్ మన భూమికి 350 మైళ్ళ ఎత్తులో అంటే సుమారుగా 563 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో గంటకి 28,800 కిలోమాటర్ల వేగంతో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మన భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 97 నిమిషాల సమయం పడుతుంది. అలా భూమి చుట్టూ తిరుగుతూనే విశ్వంలోని సుదూరప్రాంతంలోని నక్షత్రాలను, గ్రహాలను ఫోటో తీస్తుంది.

3). ఈ టెలీస్కోప్ ని నిర్మించడానికి $1.5 బిలియన్ డాలర్ల ఖర్చయ్యింది.

4). ఈ టెలీస్కోప్ 13.2 మీటర్ల పొడవు ఉంటుంది అంటే సుమారుగా ఒక బస్సు అంత సైజులో ఉంటుంది. అలాగే 10,886 కేజీల బరువు ఉంటుంది.

5). కక్ష్యలోకి వెళ్లిన తరువాత హబుల్ స్పేస్ టెలీస్కోప్ తీసిన మొదటి ఫోటో ని చూసిన శాస్త్రవేత్తలకు నిరాశ తప్పలేదు. ఎందుకంటే ఫోటోలు మసకగా రావడం జరిగింది. దానికి కారణం కెమెరా కి ఉండవసిన ఒక మిర్రర్ ని తప్పుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎంతో కాదు. ఒక వెంట్రుక మందంలోని 1/50 వంతు తప్పుగా మిర్రర్ ఏర్పాటు చెయ్యడం వలన ఇలా జరిగింది. ఆ తరువాత 1993 లో వ్యోమగాములు తిరిగి దానిని మరమత్తులు చేసి సరిచేయడంతో ఇప్పడు హబుల్ స్పృష్టమైన చిత్రాలు తియ్యగలుగుతుంది.

6). ప్రతి వారం ఈ హబుల్ స్పేస్ టెలీస్కోప్ మనకు 150 GB ల డేటాను భూమి మీదకు పంపుతుంది. అలా 1990 నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని టెరాబైట్ ల సమాచారాన్ని అందిస్తుంది

7). హబుల్ స్పేస్ టెలీస్కోప్ కి రెండువైపులా ఉండే 25 అడుగుల పొడవుండే సోలార్ పానెల్స్ మీద పడిన సూర్యకాంతి ద్వారా విడుదలైన పవర్ తో ఇది పనిచేస్తుంది.

8). హబుల్ స్పేస్ టెలీస్కోప్ మన గాలక్సీ కి అవతల ఉన్న వాటిని కూడా ఫోటోలు తీస్తుంది కానీ దగ్గరగా ఉన్న సూర్యుడి ని మాత్రం ఫోటోలు తీయదు. ఎందుకంటే ఒకవేళ హబుల్ సూర్యుడి వైపు ఫోకస్ చేస్తే సూర్యుడి నుండి వచ్చే ఆ ప్రకాశవంతమైన కాంతి వలన దానిలోని సెన్సార్ లు దెబ్బతినే ప్రమాదం ఉంది.

9). ఈ టెలీస్కోప్ ఫోటోలను కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే తీస్తుంది. తరువాత వాటిని శాస్త్రవేత్తలు కలర్ లోకి మార్చి విడుదల చేస్తారు.

10). ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ కాలమే ఈ హబుల్ టెలీస్కోప్ పనిచేసింది. అయితే ఈ హబుల్ కూడా ఇప్పడు చివరి దశకు వచ్చేసింది. 2014 లో దీనిలోని కొన్ని కీలకమైన వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2020 నుండి 2040 మధ్యకాలం ఏదో ఒక సమయంలో హబుల్ తిరిగి భూ వాతారవరణంలోకి ప్రవేశిస్తుంది. కానీ భూ ఆకర్షణ శక్తి వలన వేగంగా భూమి పైకి దూసుకువస్తున్న సమయంలో వాతావరణం లోని ఘర్షణ వలన హబుల్ భూమిని చేరే లోపే కాలి బూడిదైపోతుంది.

11). హబుల్ స్పేస్ టెలీస్కోప్ సర్వీస్ అయిపోతుందని బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే శాస్త్రవేత్తలు James Webb Space Telescope అనే మరొక టెలీస్కోప్ ని రెడీ చేసారు. ఇది హబుల్ స్పేస్ టెలీస్కోప్ కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిని భూమికి 10 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఏర్పాటు చెయ్యబోతున్నారు. దీనివల్ల మరింత స్పృష్టంగా విశ్వానికి సంబందించిన మరింత లోతుగా తెలుసుకోవచ్చు. ఈ James Webb Space Telescope ని 9 బిలియన్ డాలర్లతో నిర్మించారు.

 

హబుల్ స్పేస్ టెలీస్కోప్ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు:

 

 1. The Pillars of Creation:
NASA, ESA/Hubble and the Hubble Heritage Team

 

2. The Eagle Nebula:

NASA/ESA/The Hubble Heritage Team (STScI/AURA)

 

3. NGC 1300:

NASA/ESA/ The Hubble Heritage Team (STScI/AURA)

 

4. The Cone Nebula:

NASA/ESA/H. Ford (JHU)/G. Illingworth (UCSC/LO)/M. Clampin and G. Hartig (STScI)/The ACS Science Team
NASA/ESA/H. Ford (JHU)/G. Illingworth (UCSC/LO)/M. Clampin and G. Hartig (STScI)/The ACS Science Team

 

 

 

5. The Horsehead Nebula:

NASA/ESA/The Hubble Heritage Team (STScI/AURA)

 

6. V838 Monocerotis:

Best Hubble Space Telescope images6
NASA/ESA/The Hubble Heritage Team (STScI/AURA)

 

7. The Helix Nebula:

NASA/NOAO/ESA/The Hubble Helix Nebula Team/M. Meixner (STScI)/T. A. Rector (NRAO)

ఏది ఏమైనప్పటికి Hubble Space Telescope తీసిన చిత్రాల ద్వారానే విశ్వానికి చెందిన ఎన్నో రహస్యాలు మనం ఛేదించడం జరిగింది. అలా ఇప్పటికి హబుల్ స్పేస్ టెలీస్కోప్ నిర్విరామంగా సేవలు అందిస్తూనే ఉంది.

 

You May Like:

ఆన్ లైన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి?

Best Online Learning Websites For Students

Black Hole in Telugu-బ్లాక్ హోల్ అంటే ఏమిటి?

 

Please Share with Your Friends : )

 

5 thoughts on “Hubble Space Telescope in Telugu – Facts about Hubble

 • February 16, 2019 at 1:50 am
  Permalink

  Wow, the information is good and very helpful.

  Reply
 • February 16, 2019 at 9:31 am
  Permalink

  Bagunnaye broo supar

  Reply
 • February 27, 2019 at 1:26 am
  Permalink

  Ee video youtube lo leadu kada anna

  Reply
 • March 4, 2019 at 4:05 pm
  Permalink

  anna nenu neku big fan ne

  Reply
  • March 5, 2019 at 1:14 am
   Permalink

   Thank you so much : )

   Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial