How to Increase Brain Power and Memory in Telugu

How to Improve Brain Power and Memory:

మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన మెదడుకి ప్రతి రోజు పదును పెట్టాలి. మనం మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్(Brain Power) పెరగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

 

కొత్తగా ఏదైనా ప్రయత్నించండి:

మనం కొన్ని పనులు ప్రతిరోజూ చేస్తూనే ఉంటాం. అవి అలవాటుగా మారిపోవడం వలన అటువంటి పనులు చేస్తున్నప్పటికీ మెదడులో ఎటువంటి మార్పు జరగదు. కాబట్టి ఏదైనా కొత్తగా చెయ్యడానికి ప్రయత్నించండి. ఉదాహారానికి ఒక కొత్త వంటని వండడం, మ్యూజిక్ గాని డాన్స్ గాని నేర్చుకోవడం, లేదా ఏదైన ఒక కొత్త బాషను నేర్చుకోవడం ఇలా అన్నమాట. ఎవరైతే రెండు లేదా అంత ఎక్కువ భాషలు మాట్లాడగలరో వాళ్ళకి భవిష్యత్తులో అల్జీమర్స్ (Alzheimer’s-ఒక రకమైన మతిమరుపు) వ్యాధి వచ్చే అవకాశాలు చాల తక్కువగా ఉంటాయి.

అంతేకాదు మనం రోజువారీ చేసే పనులనే కొంచెం వెరైటీ గా కూడా చెయ్యవచు. ఉదాహారానికి ఎడమ చేతితో బ్రష్ చెయ్యడం, ఎడమ చేతితో తల దువ్వుకోవడం మొదలైనవి.

 

బుర్రకు పదును పెట్టె ఆటలు ఆడడం:

మెదడు కూడా ఒక కండరం లాంటిదే దానికి ఎప్పటికప్పుడు పని చెప్పాలి. లేకపోతె మొద్దుబారిపోతుంది. అందుకోసం సుడోకు(sudoku), క్రాస్ వర్డ్(Crossword) వంటి పజిల్స్ పూర్తి చెయ్యడం, చెస్ ఆడడం,జగ్లింగ్ (Juggling-రెండు లేదా అంతకన్నా ఎక్కువ బంతులు కింద పడకుండా ఆడే ఆట) ఇవన్నీ కూడా బుర్రకు పని చెప్పే పనులు. అలాగే వీడియో గేమ్స్(Video Games) ఆడడం వలన కూడా మన మెదడు చురుకుగా తయారవుతుంది. ముఖ్యంగా Tetris అనే వీడియో గేమ్ ఆడితే ఇంకా మంచిది. వీడియో గేమ్స్ ఆడేవాళ్లు ఏదైనా సమస్య వచ్చినపుడు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారని ఒక పరిశోధనలోతేలింది. కానీ ఎక్కువ సమయం వీడియో గేమ్స్ ఆడిన కూడా ప్రమాదమే. అలాగే సమయం దొరికినపుడు IQ Test లో పాల్గొని, మీ IQ(Intelligence Quotient) ని పెంచుకోవడానికి ప్రయత్నించండి.

I.Q (ఐ.క్యూ) అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు?

 

వ్యాయామం చెయ్యడం: 

మీకు తెలుసా మనం వ్యాయామం(Exercise) చేసిన ప్రతిసారి మన మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడతాయి. కనీసం రోజుకి 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చెయ్యడం వలన లాంగ్ టర్మ్ మెమరీ(Long term Memory) బాగుంటుంది. అలాగే ముసలితనంలో వచ్చే అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. మనం వ్యాయామం చేసినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరిగి ఎక్కువ రక్తం, ఆ రక్తం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మెదడుకి చేరుకుంటుంది. ఎంత ఎక్కువ ఆక్సిజన్ మెదడుకి చేరుకుంటే మెదడు ప్రాసెసింగ్ , పనితీరు కూడా అంత బాగుంటుంది. తద్వారా ఎప్పుడు కూడా మెదడు చురుగ్గా ఉంటుంది.

 

నిద్ర:

మనం నిద్రపోతున్న సమయంలో మెదడు మన శరీరంలో పగటిపూటంతా ఏర్పడిన విషపూరితమైన toxins ని తొలగిస్తుంది. ఈ కాలంలో చాల మంది సరిగ్గా నిద్రపోక, ఈ టాక్సిన్స్ అన్ని కూడా శరీరంలోనే ఉండిపోవడంతో రకరకాల జబ్బులు వస్తున్నాయి. అంతేకాదు సరిగ్గా నిద్ర పోకపోతే మన మెదడుకి ముందు భాగంలో ఉండే Frontal lobe లో gray-matter పరిమాణం తగ్గిపోతుంది. దీని వల్ల మన జ్ఞాపకశక్తిని దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 – 8 గంటల నిద్ర అవసరం. అలాగే మధ్యాహ్న సమయంలో సమయం దొరికితే ఒక 15 మినిషాలపాటు చిన్న కునుకు(Nap) తీయండి. ఇది మన బ్రెయిన్ కి మంచి శక్తినిస్తుంది.

త్వరగా నిద్ర పట్టాలంటే ఏమి చెయ్యాలి?

 

పుస్తకాలు చదవడం:

పుస్తకాలు చదవడం అనేది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికే కాదు మన మెదుడికి ఊహాశక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే మనం ఏదైనా చదువుతున్నపుడు దానిని ఊహించుకుంటూ చదువుతాం. ఇలా పూర్తిగా పుస్తకం చదవడంలో లీనమవ్వడం వలన టెన్షన్ లు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు మిగతా సమయంలో మన మెదడులో సరిగ్గా పనిచెయ్యని భాగాలన్నీ కూడా చదువుతున్నపుడు ఆక్టివేట్ అవుతాయట. కాబట్టి ప్రతిరోజూ కొంతసేపు జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక పుస్తకాన్ని చదవండి.

లైఫ్ లో ఒక్కసారైనా అందరూ తప్పకుండ చదవవలసిన పుస్తకాలు:

మన జీవితాన్ని మార్చగలిగే పుస్తకాలు

 

ధ్యానం చెయ్యడం:

ప్రతి రోజు కనీసం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో మనం దీర్ఘంగా లోపలి గాలి తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ మెదడుకి చేరుకొని మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే మనలోని టెన్షన్(Tension) లు తగ్గుతాయి. నెగటివ్ ఆలోచనలు(Negative thoughts) దూరమవుతాయి. అంతేకాదు ప్రతిరోజూ ధ్యానం చేసేవాళ్ళ జీవితకాలం కూడా పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ధ్యానంతో జ్ఞాపకశక్తి , ఏకాగ్రత కూడా పెరుగుతాయి.

 

మంచి ఆహారం తీసుకోవడం:

మనం తీసుకునే ఆహారం మన మెదడు మీద చాల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మన తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తిలో సుమారుగా 20% పైగా మన మెదడే తీసుకుంటుంది. ఈ బిజీలైఫ్ లో ఎప్పుడు తింటున్నామో, ఏమి తింటున్నామో కూడా మనం పట్టించుకోవడం లేదు. సమయం సరిపోక బయటదొరికే జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్లు ,కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటున్నాం. ఇవి మన శరీరానికే కాదు మన మెదడుకి కూడా చాలా ప్రమాదకరం. ఈ పదార్దాలలో ఉండే షుగర్స్ మన బ్రెయిన్ లోని న్యూరాన్ల మధ్య కనెక్షన్స్ ని దెబ్బతీసి మెదడు మొద్దుబారేలా చేస్తాయి. అలాకాకుండా మన మెదడుకి ఎక్కువగా ఉపయోగపడే గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు, చేపలు వంటి వాటిని ఎక్కువగా తినాలి.

అలాగే నీటిని కూడా ఎక్కువగా తాగండి. ఎందుకంటే మన మెదడులో సుమారుగా 70 -80% నీరే ఉంటుంది దీనిలో కనీసం రెండు శాతం నీరు తగ్గినా ఏకాగ్రత (concentration) ఉండకపోవడం. షార్ట్ టర్మ్ మెమరీ(Short term memory) దెబ్బతిని ఇప్పుడే జరిగిన సంఘటలను కూడా మర్చిపోవడం వంటివి జరుగుతుంది. కాబట్టి కనీసం రోజుకి 8 గ్లాసుల నీటినైనా తాగాలి.

ఇవే కాదు మ్యూజిక్ వినడం, పెంపుడు జంతువులతో గడపడం, ఎక్కువగా నవ్వడం, పాజిటివ్ గా ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉండడం, ఇవన్నీ కూడా మెదడుకి పదును పెట్టేవే. కాబట్టి వీటన్నిటిని ప్రతిరోజు ఆచరించండి, అలవాటుగా మార్చుకోండి. మీలో కలిగే మార్పులను మీరు తప్పకుండ గమనిస్తారు.

 

You May Like: 

మన మెదడు ఎలా పనిచేస్తుంది?

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

 

Please Share with Your Friends : )

25 thoughts on “How to Increase Brain Power and Memory in Telugu

 • September 30, 2018 at 1:53 am
  Permalink

  Sir logo youtube ki ella chessaru

  Reply
  • September 30, 2018 at 3:18 am
   Permalink

   PicArt App lo chesanu sir

   Reply
 • September 30, 2018 at 2:17 am
  Permalink

  Anna American digger video pettanna
  You tube Lo nenu Abdul Kalam ni
  Na mail delete ayyindhi andhukani
  E mail

  Reply
  • September 30, 2018 at 3:15 am
   Permalink

   try chestanu bro

   Reply
 • September 30, 2018 at 3:30 am
  Permalink

  How the cells were formed in the world rama krishna

  Reply
 • September 30, 2018 at 4:28 am
  Permalink

  text in english

  Reply
 • September 30, 2018 at 5:10 am
  Permalink

  Super bro,youth eerojulo kaligavutunaru kabati youth ku vupayoge machi tips,developement skills, jobs, any education and uneducation youth bro

  Reply
 • September 30, 2018 at 5:50 am
  Permalink

  Bro please say about
  Chemistry facts

  Reply
 • September 30, 2018 at 6:23 am
  Permalink

  Excellent information
  If we follow
  We can change our life
  I will follow brother
  Thank you telugu badi

  Reply
 • September 30, 2018 at 7:09 am
  Permalink

  This website will be the best in future for telugu people

  Reply
 • September 30, 2018 at 8:17 am
  Permalink

  Bro I want to know how can we become immortal in future days bro I am very passionate for telugu badi youtube channel so please make a video about the immortal

  Reply
 • September 30, 2018 at 9:07 am
  Permalink

  All the best u r website bro , regular ga me videos chustuvunta, meru inka marinni videos chestu, website inka development avvalani korutuntunna bye bro

  Reply
 • September 30, 2018 at 9:51 am
  Permalink

  After noon a kuva sepu padukunte m aina defect vutundha

  Reply
 • October 1, 2018 at 4:19 pm
  Permalink

  అణా చాలా బాగుంది నేను నీ వీడియోస్ ని ఫాలో అవ్వడం వలన నాకు చాలా వరకు మంచి పనులు అలవాటు అవుతున్నాయి అంటె మొబైల్ తక్కువ చూడాటం బుక్స్ చదవడం కొత్త విషయలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్న కానీ నేను గోల్ఫ్ లో ఉన్నడం వలన తెలుగు బుక్స్ దొరకడంలేదు కె నాకు కొంచెం తెలుగు బుక్స్ చదువుకొని అప్ వుంటే చెప్పు అన్న really నేను నీకు big fan ని

  Reply
  • October 2, 2018 at 1:53 am
   Permalink

   Amazon lo gaani Google Play books lo gaani Telugu books konukkuni chaduvukovachu bro

   Reply
   • October 12, 2018 at 2:04 pm
    Permalink

    Bro me name cheppandi ple

    Reply
    • October 14, 2018 at 12:39 am
     Permalink

     Rama Krishna

     Reply
 • October 2, 2018 at 6:01 am
  Permalink

  Hi anna. Telugubadi chal useful ga undi. Alage eye sight ela improve chesukovalo. Oka article or oka video chey anna.

  Reply
 • October 2, 2018 at 11:22 am
  Permalink

  Hi spoken English
  Grammar..
  Webpage lo pettu Anna…

  Reply
 • October 3, 2018 at 2:06 pm
  Permalink

  sir biogrpahy matter telugu story la in ivandi…….

  Reply
 • October 9, 2018 at 7:07 am
  Permalink

  సమయం అని వైపుల ఒకే సమయం ఉండదు ఏందుకు ‌

  Reply
 • October 17, 2018 at 4:55 pm
  Permalink

  Time travel gurinchi Pettu bro

  Reply
 • November 4, 2018 at 1:17 am
  Permalink

  Anna oka app kanipettu

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial