NASA’s Parker Solar Probe in Telugu-Telugu Badi

NASA’s Parker Solar Probe Mission:

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా ((NASA) సూర్యుడికి సంబందించిన రహస్యాలను ఛేదించడం కోసం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని చేపట్టింది . అదే ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ (Parker Solar Probe) అనే ఒక వ్యోమ నౌకను సూర్యుడి దగ్గరకు పంపడం. ఆగష్టు 12, 2018 తేదీన డెల్టా 4 (Delta IV) అనే ఒక భారీ రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. ఇప్పటి వరకు ఏ Spacecraft కూడా చేరుకోనంత దగ్గరగా అంటే సూర్యుడి సుమారుగా 60లక్షల కిలోమీటర్ల సమీపానికి ఇది చేరుకోబోతుంది.

సూర్యుడి నుండి సౌరగాలులు వీస్తాయని మొట్టమొదటిసారిగా చెప్పిన Eugene Parker అనే ఒక శాస్త్రవేత్త పేరుని ఈ spacecraft కి పెట్టారు. బ్రతికున్న ఒక వ్యక్తి పేరుని ఒక Spacecraft కి పెట్టడం ఇదే మొదటిసారి.

ఈ నౌక సూర్యుడి దగ్గరకు చేరుకోవడానికి 7 సంవత్సరాల సమయం పడుతుంది.ఈ ప్రయోగానికి 1.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. మరి ఇంత ఖర్చుపెట్టి ఈ ప్రయోగం చెయ్యడం ఎందుకు అనే సందేహం మనకు కలుగుతుంది. దీనికి కారణం మనం ముందు చెప్పుకున్నట్టు సూర్యుడి నుండి ఒక్కొక్కసారి విపరీతమైన శక్తి కలిగిన సౌర గాలులు వీస్తాయి. దీనినే “సౌర తుఫాన్” (Solar wind) అని అంటారు. ఇవి కనుక మన భూమి దగ్గరలోకి వస్తే ఇప్పుడు మన భూమి చుట్టూ తిరుగుతున్న సాటిలైట్ అన్ని కూడా పూర్తిగా పాడైపోతాయి. అంతే కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సిస్టం, వాటికి కనెక్ట్ చేసి ఉన్నటువంటి ఫోన్లు, కంప్యూటర్ లు, టీవీ లు ఇలా అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు కూడా నాశనమయ్యిపోతాయి. ఒకవేళా అటువంటి పరిస్థితి ఎదురైతే మనకి సుమారుగా 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తినష్టం ఏర్పడవచ్చని ఒక అంచనా.

 

Sun-flare-Suns-atmosphere-the-corona-erupted-out-into-space

 

అంతేకాదు మరొక పదిసంవత్సరాలలో ఇటువంటి సౌర తుపాను వచ్చే అవకాశం 12% ఉందని నాసా(NASA) అంచనా వేస్తుంది. కానీ అది సరిగ్గా ఎప్పుడు వస్తుందో అనేది మనకి తెలియదు. ఇప్పుడు పంపిన ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌'(Parker Solar Probe) వచ్చే తుఫానుని ఆపదు,కానీ ఇటువంటి ప్రమాదం ఏదైనా రాబోతుంటే ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంది. దాంతో జరగబోయే నష్టాన్ని చాలవరకు తగ్గించవచ్చు. అలాగే మనం పంపిన, భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ ని కాపాడుకోవచ్చు.

 

అంతే కాదు సూర్యుడి ఉపరితం వద్ద సుమారుగా 5,505 °C ల వేడి ఉంటుంది. కానీ సూర్యుడి ఉపరితం నుండి 2100 km దూరంలో ఉన్నటువంటి కరోనా (CORONA) అనే లేయర్ వద్ద మాత్రం 500,000°C కన్నా ఎక్కువ వేడి ఉంటుంది. సూర్యుడి కన్నా దూరంగా ఉన్న ప్రాంతం లో వేడిగా ఎక్కువగా ఉండడమేంటో ఇప్పటికి శాస్త్రవేత్తలకు అర్ధంకావడం లేదు. ఈ రహస్యాన్ని కూడా ఈ Spacecraft ఛేదించబోతుంది.

 

sun-surface-temperature-corona-telugubadi

 

అంతవేడిని తట్టుకోవడం కోసం ఈ Spacecraft ముందు ఒక హై టెక్ హీట్ షీల్డ్ (hi-tech Heat Shield)ని అమర్చారు. ఇది కరోనా లో ఉండే హీట్ మరియు రేడియేషన్ నుండి ఈ ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ ని కాపాడుతుంది. సూర్యుడి దగ్గరకు చేరుకునే కొద్దీ ఈ Spacecraft వేగం విపరీతంగా పెరిగిపోతుంది.

2025 సంవత్సరం నాటికి ఇది సూర్యుడి దగ్గరకు చేరుకుంటుంది. ఏది ఏమైతేనేం భవిష్యత్తులో ఈ ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ సూర్యుడికి సంబంధించి ఎటువంటి నిజాలను బయట పెడుతుందో చూడాలి మరి.. !

You May Like:

Black Hole (బ్లాక్ హోల్) అంటే ఏమిటి?

 

Please Share with Your Friends : )

11 thoughts on “NASA’s Parker Solar Probe in Telugu-Telugu Badi

 • September 30, 2018 at 2:07 am
  Permalink

  ok bro. i support you

  Reply
  • October 2, 2018 at 1:00 am
   Permalink

   Anna videos tvaraga uploaded chai Anna wating

   Reply
 • September 30, 2018 at 2:30 am
  Permalink

  Bro please make a video on it

  Reply
 • September 30, 2018 at 3:27 am
  Permalink

  Please make a vedio broo in this website please bro

  Reply
 • September 30, 2018 at 3:41 am
  Permalink

  i will support u rama

  Reply
 • September 30, 2018 at 5:44 am
  Permalink

  Make video on it bro please

  Reply
 • September 30, 2018 at 5:45 am
  Permalink

  Good information bro.keep going on.we always support you

  Reply
 • September 30, 2018 at 12:48 pm
  Permalink

  I will support you bro

  Reply
 • October 2, 2018 at 2:21 am
  Permalink

  3d movies speads pattukoni endhuku chudali a pictures endhuku dhagharagha vosthai. Okavala a 3d speads these astha manakandhuku clear gha canapadadhu.

  Reply
 • October 5, 2018 at 2:39 pm
  Permalink

  Please make a video on it.

  Reply
 • October 19, 2018 at 5:32 am
  Permalink

  I will support u Rockey bro

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial