అద్భుతమైన శక్తులున్న సూపర్ హుమన్స్ – Real Life Super Humans

Real Life Super Humans with Super Powers:

హాలీవుడ్ సినిమాలలో హీరోలకి సూపర్ పవర్స్ (Super Powers) ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సూపర్ పవర్స్ ఉన్న మనుషులు కొంతమంది మన మధ్యలో కూడా ఉంటారు. వీళ్ళు మనమందరి కంటే కొంచెం వైవిధ్యంగా ఉంటారు. ఈ పవర్స్ కొంతమందికి పుట్టుకుతోనే వస్తే మరికొంతమందికి సాధన చెయ్యడం ద్వారా ఆ సూపర్ పవర్స్ ని సంపాదించుకున్నారు. అలాంటి కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Stephen Wiltshire:

లండన్ కి చెందిన ఇతను ఒక ఆర్టిస్ట్. ఇతను దేనినైనా ఒకసారి చూసాడంటే అది ఉన్నదిఉన్నట్టు గీసెయ్యగలడు. ఇతను 2005 లో టోక్యో నగరాన్ని హెలికాఫ్టర్ నుండి ఒకసారి చూసి 32 అడుగుల పేపర్ మీద 7 రోజులలో మొత్తం టోక్యో నగరాన్ని గీసేసాడు. గీయడం అంటే ఏదో పై పైన గీయడం కాదు ఆ నగరంలో ఎన్ని వీధులు ఉన్నాయి, ఒక్కొక్క వీధిలో ఎన్ని బిల్డింగ్ లు ఉన్నాయి, ఒక్కొక్క బిల్డింగ్ కి ఎన్ని స్తంబాలు ఉన్నాయి, ఇలా అన్ని క్లియర్ గా గీయగలడు.

 

superhuman super powers telugu Stephen Wiltshire

అలాగే 2011 లో న్యూయార్క్ నగరాన్ని చూసి ఏకంగా 76 మీటర్ల పొడవైన పేపర్ మీద పనోరమిక్ ఇమేజ్ గీసేసాడు.
అసలు ఇతనికి అంత మెమరీ ఎలా వచ్చిందో శాస్త్రవేత్తలకు అర్ధం కావడం లేదు. ఇతను చిన్న వయసులో ఉన్నపుడు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. దాంతో ఇతను స్కూల్ లో ఏదైనా చెప్పాలనుకుంటే బొమ్మలు గీసి చెప్పేవాడు. అలా అతనికి డ్రాయింగ్ లో ఇంటరెస్ట్ పెరిగింది. ఇతనికి 9 ఏళ్ల వయసులో పూర్తిగా మాట్లాడం వచ్చిందట.
ఇతనికి ఉన్న టాలెంట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఇతనికి Human Camera అనే బిరుదు కూడా ఉంది.

 

2. Zhou Ting-Jue:

ఈయన Tai Chi మరియు Kung Fu లో గ్రాండ్ మాస్టర్. ఈయన కేవలం తన చేతులు ఉపయోగించి విపరీతమైన వేడిని పుట్టించగలరు. అదీ కూడా సుమారుగా నీరు ఆవిరైపోయేంత వేడి అన్నమాట

ఈయన తన 7 ఏళ్ల వయసు నుండి తన తాత గారి దగ్గర కుంగ్ ఫు, Qigong నేర్చుకున్నారు అప్పటినుండి ఆయన వాటిని ప్రాక్టీస్ చేసారు.ఈయన శక్తి సామర్ధ్యాల మీద మెడికల్ గా మరియు సైంటిఫిక్ గా ఎన్నో పరిశోధనలు జరిగాయి. థర్మల్ కామెరాల ద్వారా ఈయన తన చేతుల ద్వారా విడుదల చేస్తున్న టెంపరేచర్ ని కొలిచినప్పుడు అది 202 ఫారంహీట్ డిగ్రీల వేడి అని తేలింది. అంటే ఇది సుమారుగా వాటర్ ఆవిరయ్యే టెంపరేచర్ అన్నమాట. ఆయన ఒక తడి గుడ్డముక్కను చేతితో పట్టుకుంటే ఆ క్లాత్ నుండి నీరు ఆవిరైపోవడం మనం కళ్లారా చూడవచ్చు. కేవలం వట్టి చేతులతో అంత వేడిని ఎలా పుట్టించగలుగుతున్నాడో శాస్త్రవేత్తలకు అర్ధం కావడం లేదు.

super humans super-powers-Zhou-Ting-Jue

అంతే కాదు ఈయన తన బాడీ వెయిట్ మొత్తని కంట్రోల్ చెయ్యగలరు. భూమికి కొంత ఎత్తులో ఉంచబడిన పేపర్ మీద ఆ పేపర్ చిరిగిపోకుండా దాని మీద నిడబడగలరు.
ఈయన అలా తన చేతుల నుండి వస్తున్న వేడితో చాలా మందికి ఎప్పటినుండో ఉన్నటువంటి దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేస్తున్నారు. అందుకే ఈయనను The Jewel of China అని అంటారు.

 

3. Shakuntala Devi:

మన దేశానికి చెందిన ఈమె కంప్యూటర్ కన్నా వేగంగా లెక్కలు చెయ్యగలరు. ఈమె 13 అంకెలు కలిగిన రెండు నెంబర్ లను (7,686,369,774,870 × 2,465,099,745,779 ) మనసులోనే గుణించి కేవలం 28 సెకనులల్లో దాని ఆన్సర్ 18,947,668,177,995,426,773,730 అని చెప్పగలిగారు. అందుకుగాను 1982 లో ఈమెకు గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది.

వీటన్నిటికీ మించి 201 అంకెలున్న (916,748,676,920,039,158,098,660,927,585,380,162,483,106,680,144,308,622,407,126,516,427,934,657,040,867,096,593,279,205,767,480,806,790,022,783,016,354,924,852,380,335,745,316,935,111,903,596,577,547,340,075,681,688,305,620,821,016,129,132,845,564,805,780,158,806,771 ) నెంబర్ కి 23rd root సమాధానం 546,372,891 అని కేవలం 50 seconds చెప్పగలిగారు. ఈ సమాధానంసరైనదా? కాదా? అని చెక్ చెయ్యడానికి ఇదే ప్రశ్నను UNIVAC 1101 అనే computer కి ఇస్తే, ఆ కంప్యూటర్స్ కి దీనిని లెక్కించడానికి 62 seconds పట్టింది. అంటే కంప్యూటర్ కన్నా 12 సెకన్ల ముందే ఆమె చెప్పగలిగారు. ఇలా ఒకటా రెండా ఎన్నో మాథ్స్ ప్రాబ్లెమ్స్ ని కంప్యూటర్ లకన్నా వేగంగా చేసేవారు. అందుకే ఈవిడకు Human Computer అనే బిరుదు దక్కింది.

 

super powers super humans telugu Shakuntala Devi

ఆమె ఇంత వేగంగా లెక్కలు చెయ్యడానికి ఆమె ఉపయోగించే కొన్ని మెథడ్స్ ని ఆమె రాసిన ‘Figuring: The Joy of Numbers అనే పుస్తకం లో తెలియజేసారు. ఈమె బెంగళూరు లో 83 ఏళ్ల వయసులో మరణించారు.

 

Figuring: The Joy of Numbers: Buy on AMAZON or FLIPKART

 

4.  Veronica Seider:

 

జర్మనీ కి చెందిన Veronica Seider అనే ఈమె కంటి చూపు మనకన్నా 20 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. మనం ఒక వీధి చివర ఉన్న వ్యక్తిని కూడా సరిగా గుర్తించలేము, కానీ ఈమె ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషి ముఖాన్ని కూడా గుర్తించగలదు. అంతేకాదు ఆమె చూపు ఎంత తీక్షణంగా ఉంటుందంటే 10 పేజీలలో ఉన్న సమాచారాన్ని ఆమె కేవలం ఒక పోస్టల్ స్టాంప్ మీద సరిపడేలా రాయగలదు.

 

5. Daniel Kish:

ఇతనికి చిన్నవయసులోనే కంటి చూపు పోయింది. అయితే Daniel మాత్రం బాధపడలేదు. అతను echolocation అనే టెక్నిక్ నేర్చుకున్నాడు. సాధారణంగా గబ్బిలాలు ఈ పద్దతిని ఉపయోగిస్తాయి. గబ్బిలాలు చీకట్లో ఎగిరేటప్పుడు శబ్దాలను చేస్తాయి. ఆ సౌండ్స్ ఎదురుగా ఏదైనా వస్తువు ఉంటె వాటిని తాకి echo అంటే ప్రతిధ్వని విడుదలవుతుంది. ఆ ప్రతిధ్వనులను మళ్ళీ గబ్బిలాలు విని ఎదురుగా ఉన్న వస్తువు ఎంత దూరంలో ఉంది ఏ సైజు లో ఉంది అనేది తెలుసుకుంటాయి.

super human-super-powers Daniel Kish telugu

ఇదే పద్దతిని Daniel Kish కూడా నేర్చుకున్నాడు. అతను తన నాలికతో చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ అవి రివర్స్ లో వచ్చిన ప్రతిధ్వని ద్వారా ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తించగలడు. అలా ఇతను 1000 అడుగుల దూరంలో ఉన్న భవనాలను, 30 అడుగుల దూరంలో ఉన్న చెట్లను కూడా గుర్తించగలడు. ఈయన తనకున్న ఆ టాలెంట్ తో మనలాగే రోడ్లపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోగలరు, కొండలు, పర్వతాలు కూడా ఎక్కగలరు. ఇప్పుడు ఇతను ఈ echolocation టెక్నిక్ ని చూపులేని మరొక 500 మంది నేర్పుతున్నారు.

 

6. Laurence Kim Peek:

ఈయన ఒక పుస్తకంలో ఎడమ వైపు పేజీని ఎడమ కన్నుతో, కుడివైపు పేజీని కుడి కన్నుతో ఒకేసారి చదవగలరు. ఇలా ఇతను ఏ పుస్తకనైనా సుమారుగా గంటలో చదవగలరు. అంతేకాదు అదంతా గుర్తుపెట్టుకోగలరు.ఈయన చిన్నపుడు వాళ్ళ నాన్నగారితో కలిసి లైబ్రరికి వెళ్లేవారు అక్కడ గంటకి ఒక పుస్తకం చొప్పున చదివేసేవాడు. అలా ఇతను కొన్ని వేల పుస్తకాలు, encyclopedia లు, చదివాడు. అందుకే ఇతన్ని “Living Encyclopedia” అంటారు. అంతేకాదు ఇతను ప్రపంచ మ్యాప్, అట్లాసులను కూడా గుర్తుపెట్టేసుకున్నాడు. ప్రపంచంలో ఏ సిటీ నుండి ఏ సిటీ కి అయినా ఏ direction లో వెళ్తే త్వరగా వెళ్లగలమో … ఎలా వెళ్లాలో మొత్తం direction చెప్పగలడు. అందుకే ఇతనికి Walking GPS అని కూడా అంటారు. అలాగే ఎప్పుడో జరిగిన మ్యాచ్ లకు సంబందించిన స్కోర్ లు కూడా చెప్పగలిగేవాడు.

Laurence-Kim-Peek telugu

ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు  బుద్ది మాంద్యంతో బాధపడేవాడు. అప్పుడు ఒక డాక్టర్ Kim Peek భవిష్యత్తులో మాట్లాడలేడని , చదవలేడని… ఏదైనా మెంటల్ హాస్పిటల్ లో చేర్పించమని చెప్పారట. కానీ ఇపుడు అతను చదివినట్టు ప్రపంచంలో ఎవరూ చదవలేరు. కానీ ఈయన తన పనులు తానూ చేసుకోలేరు ఉదాహరనికి షేవింగ్ చేసుకోవడం, తల దువ్వుకోవడం, బ్రష్ చేసుకోవడం, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం ఇవేమి ఆయనకి రావు. వాళ్ళ నాన్న గారే ఇతనిని చూసుకునేవారు.

ఈయన ఇప్పటివరకు సుమారుగా 12000 పుస్తకాలు చదివారట .ఆ 12000 వేల పుస్తకాలలో ఏ ప్రశ్న అడిగిన ఆయన సమాధానం చెప్పగలరు. కానీ ఈయన 2009 లో మరణించారు.

 

7. Michel Lotito:

ఫ్రాన్స్ కి చెందిన ఇతని పేరు Michel Lotito ఇతను దేనినైనా తినెయ్యగలడు. అది గ్లాస్, చెక్క, రబ్బర్, మెటల్ ఇలా ఏదైనా సరే సింపుల్ గా తినేస్తాడు. మరి ఇటువంటివి తిన్నపుడు నోట్లో గుచ్చుకుంటాయి కదా అనే సందేహం కలుగుతుంది. ఇతను తినేటప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి నోట్లో ఎక్కడ గుచ్చుకోకుండా తినడం నేర్చుకున్నాడు. వాటిని సులువుగా మింగడం కోసం వాటిని తినేటప్పుడు ఇతను పెట్రోలియం నుండి వచ్చే మినరల్ ఆయిల్ ని, నీటిని ఎక్కువగా త్రాగుతాడు.

michel-lotito-telugu

అలా ఇతను ఇప్పటివరకు 18 సైకిళ్లు, 15 shopping carts, 7 టీవీ సెట్లు , 2 మంచాలు, 6 chandeliers, ఒక శవ పేటిక ను తిన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రెండు సంవత్సరాల పాటు Cessna 150 అనే ఒక విమానాన్ని తినేసాడు. ఇలా ఇతను ప్రతిరోజూ 1 కేజీ మెటల్ తినేవాడు. అలా 1959 నుండి 1997 మధ్య కాలంలో ఈయన సుమారుగా 9 టన్నుల మెటల్ తిన్నాడట.

ఇతన్ని డాక్టర్లు పరీక్షించగా ఇతను pica అనే medical condition తో బాధపడుతున్నాడని ఇది ఉన్న వాళ్ళకి మట్టి, గ్లాస్, ఇనుము వంటి వస్తువులు తినాలనిపిస్తుందని తేల్చారు. అంతేకాకుండా ఇతని కడుపు మరియు ప్రేగుల కండరాలు మనకన్నా ఎక్కువ మందంగా ఉన్నాయని అందుకే ఇలాంటివి తిన్నాసరే ఇతనికి ఎటువంటి గాయం కావడం లేదని డాక్టర్లు గుర్తించారు . ఇలా దేనినైనా తినగలుగుతున్నాడు కాబట్టి ఇతనికి Mr. Eats All అనే పేరు వచ్చింది. ఇక్కడ విచిత్రమేంటంటే ఎలాంటిదానినైన తిని అరిగించుకునే ఇతనికి అరటి పళ్ళు గాని ఉడకబెట్టిన గుడ్లు గాని తింటే అరగక ఇబ్బంది పడేవాడు. ఈయన June 25, 2007 సంవత్సరంలో 57 ఏళ్ళ వయసులో మరణించారు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్స్ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి తెలిసినప్పుడు మన శరీరానికి అతీతమైన శక్తులు ఉన్నాయని వాటితో అద్భుతాలు చెయ్యగలమని అర్ధమవ్వుతోంది. మరీ ఇలాంటి పవర్స్ కాకపోయినా మనలో కూడా ప్రతి ఒక్కొక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించి కష్టపడితే మనం కూడా ఒక సూపర్ హుమన్ గా మారవచ్చు.

You May Like:

జీవితాన్ని మార్చగలిగే కొన్ని పుస్తకాలు

రెడ్ బస్ సక్సెస్ స్టోరీ

యూట్యూబ్ నుండి మనీ సంపాదించడం ఎలా?

 

Please Share with Your Friends : )

3 thoughts on “అద్భుతమైన శక్తులున్న సూపర్ హుమన్స్ – Real Life Super Humans

 • December 23, 2018 at 7:30 am
  Permalink

  Extraordinary facts

  Reply
 • December 23, 2018 at 2:54 pm
  Permalink

  Eee content video chesivunte eroju video vundedhi Bro.. 🤔🤔

  Reply
 • February 6, 2019 at 3:41 pm
  Permalink

  annaiah nuvu videola chesi panpi

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial