What is Sensex and Nifty in Telugu-Telugu Badi

 

మనం ప్రతి రోజు న్యూస్ పేపర్లలో గాని వార్తలలో గాని సెన్సెక్స్ (Sensex) ఇన్ని పాయింట్లు లాభపడింది లేదా నిఫ్టీ (Nifty) ఇన్ని పాయింట్లు నష్టపోయింది వంటి వార్తలను చదువుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. అసలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం . ముందు వీటి గురించి అర్ధం అవ్వాలంటే ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి .

ఇండెక్స్ (Index) అంటే ఏమిటి ?

ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్లు ఏవిధంగా ఉన్నాయో సూచించే ఒక సూచి. అంటే ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనేది ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే మనం అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే గిన్నెలో నాలుగు మెతుకులు తీసి చుస్తే సరిపోతుంది కదా. అంతే గాని ప్రతి మెతుకుని తీసి పరీక్షించడం అనేది కుదరదు .. అలాగే స్టాక్ మార్కెట్ లోనూ జరుగుతుంది . మన దేశం లోని BSE ( బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి )లో సుమారుగా 5000 లకు పైగా కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి . అలాగే NSE (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ) లో దాదాపుగా 2000 కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉందొ చూడాలనుకుంటే ఇన్ని వేళా కంపెనీలను పరీక్షింది బేరీజు వెయ్యడం చాల కష్టం . అందుకే ఇన్ని కంపెనీలను కాకుండా ప్రతి ఇండస్ట్రీ పరంగా ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి కొన్ని కంపెనీలను తీసుకుని ఆ కంపెనీల షేర్ల కదలికను బట్టి మొత్తం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ని అంచనా వేస్తారు

ఇటువంటివి మన దేశంలో ముఖ్యంగా రెండు సూచీలు ఉన్నాయి . ఒకటి సెన్సెక్స్ ,రెండు నిఫ్టీ. ముందుగా సెన్సెక్స్ అంటే ఏంటో చూద్దాం

(Sensex) సెన్సెక్స్:

(Sensex) సెన్సెక్స్ అనే అనే పదం Sensitive Index అనే దాని నుండి వచ్చింది సెన్సెక్స్ ని S&P BSE SENSEX లేదా S&P SENSEXఅని కూడా పిలుస్తారు . సెన్సెక్స్ అనేది ఒక రోజులో లేదా ఒక ఫలానా సమయంలో ఇండియా లోని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనే విషయాన్ని తెలిపే ఒక సూచీ

(Bombay Stock Exchange) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కొన్ని వేల కంపెనీలలో …ఒక కంపెనీ చరిత్ర ,అలాగే ఏ కంపెనీ మార్కెట్ కాపిటల్ ఎక్కువగా ఉందొ , మరియు ఏ కంపెనీ పనితీరు బాగుందో చూసి వాటిలో మొదటి కొన్ని కంపెనీలను తీసుకుంటారు ..

సెన్సెక్స్ ని ప్రభావితం చేసే కొన్ని కంపెనీలు ఇవే :

Adani Ports

Asian Paint

Axis Bank

Bajaj-Auto

Bharti Airtel

Cipla

Coal India

Dr. Reddy’s Laboratories

HDFC

HDFC Bank

Hero MotoCorp

Hindustan Unilever

ICICI Bank

Infosys

ITC

Kotak Mahindra Bank

L&T

Lupin Limited

Mahindra & Mahindra

Maruti Suzuki

NTPC

PowerGrid Corporation of India

Reliance Industries

SBIN

Sun Pharma

Tata Motors

Tata Steel

TCS

Wipro

(ఈ లిస్ట్ లో ఇవే కంపెనీ లు ఉండాలని ఏమి లేదు. ఈ లిస్ట్ లో కంపెనీ లు మారుతూ ఉండవచ్చు)

ఫలానా రోజులో ఈ  కంపెనీ లో ఎక్కువ కంపని లాభాల్లో ఉంటె ఆ రోజు సెన్సెక్స్ కూడా పెరుగుతుంది ఒకవేళ ఈ  కంపెనీలలో ఎక్కువ కంపెనీలు నష్టపోతే ఆ రోజు సెన్సెక్స్ కొన్ని పాయింట్లు నష్టపోవడం జరుగుతుంది ..
1979 లో సెన్సెక్స్ base value ని 100 పాయింట్లుగా తీసుకున్నారు .. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 36500 వరకు చేరుకుంది .. అంటే మార్కెట్లు ఏవిదంగా పెరిగాయో అర్ధం అర్ధం చేసుకోవచ్చు

నిఫ్టీ (Nifty):

Nifty అనే పదం National Stock Exchange Fifty అనే పదం నుండి వచ్చింది. ఈ నిఫ్టీ ని . NIFTY 50 అని CNX NIFTY అని కూడా పిలుస్తారు Nifty అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కంపెనీలలో టాప్  కంపెనీలను తీసుకుని వాటి షేర్ల ధర కదలిక ఆధారంగా ఈ నిఫ్టీ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది ..అయితే ఎప్పుడు ఈ కంపెనీలు మాత్రమే ఆ లిస్ట్ ఉంటాయని ఏమి లేదు .. కొన్ని కంపెనీ లు ఈ లిస్ట్ నుండి తీసివేయబడతాయి అలాగే కొన్ని కంపెనీ పేర్లు చేర్చబడతాయి.

 

Sensex గురించి తెలుసుకోవడానికి >>  www.bseindia.com
Nifty గురించి తెలుసుకోవడానికి >>      www.nseindia.com

 

You May like:

IPO అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్ లో తెలుసుకోవాల్సిన పదాలు.

 

Please Share with your friends : )

 

2 thoughts on “What is Sensex and Nifty in Telugu-Telugu Badi

  • September 30, 2018 at 7:13 am
    Permalink

    Anna soap water looo thadistane nuraga andhuku vastundi

    Reply
  • October 15, 2018 at 4:23 pm
    Permalink

    Bro endukani tooth paste box la meeda red blue black green strips untayi

    Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial