How to Overcome Stage Fear -8 ways to conquering Stage Fright

How to Overcome Stage Fear: 

మనలో చాలా మంది … ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు. కానీ స్టేజ్ ఎక్కి నలుగురి ముందు మాట్లాడమంటే మాత్రం భయపడిపోతారు.

మీరు విద్యార్థి అయితే సెమినార్ లలో , ఉద్యోగి అయితే మీటింగ్ లలో ఏదో ఒక సమయంలో నలుగురి ముందుకు వెళ్లి మాట్లాడవసిన పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి సమయంలో మనలో చాలా మందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్ళు, చేతులు వణికిపోతాయి, చెమటలు పెట్టేస్తాయి, ఒళ్ళంతా చల్లపడిపోతుంది. దీనికి కారణం స్టేజ్ ఫియర్ (Stage Fear).
అసలు స్టేజ్ ఫియర్ అంటే ముందు మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని మనకు మనమే ఊహించుకుని భయపడటమే.

చాలా మందికి మంచి నాలెడ్జి ఉంటుంది. కానీ స్టేజి ఫియర్ వలన దానిని వ్యక్తపరచలేరు. దీని వల్ల ఎన్నో గొప్ప అవకాశాలను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మీరు ఉన్న రంగంలో మీరు లీడర్ గా మారాలనుకుంటే మీకు ఉండవలసిన వాటిలో Public Speaking కూడా ఒకటి.

ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. Great Public Speakers Are Made, Not Born

పుట్టుకతోనే ఎవరూ కూడా గొప్ప ఉపన్యాసకులుగా పుట్టరు. వాళ్ళని వాళ్ళు గొప్ప వక్తలుగా మలుచుకుంటారు.

మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. దాని కోసం ఇప్పుడు చెప్పబోయే కొన్ని సలహాలతో మీ స్టేజ్ ఫియర్ (Stage Fear)ని పోగొట్టుకోగలరు . ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలరు

 

8 Ways to Overcome Stage Fright:

1. ముందు మీరు ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నారో ఆ టాపిక్ గురించి మీకు పూర్తిగా తెలిసుండాలి. చెప్పే విషయం మీద మీకు మంచి పట్టు ఉన్నప్పుడు మీరు భయపడవలసిన పనేం ఉంటుంది?. ఒకవేళ మిమ్మల్ని మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. కాబట్టి మీరు చెప్పబోయే దానిగురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి.

2. మీకు టాపిక్ మీద ఎంత పట్టు ఉన్నా సరే. మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఇంట్లో అద్దం ముందు నిలబడి మీరు ఇవ్వబోయే స్పీచ్ ని ప్రాక్టీస్ చేయండి. లేదా మీ మొబైల్ తో రికార్డు చేసి తరువాత చూసుకోండి. దీని వల్ల మనం చేసే తప్పులేంటో మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు.అలాగే కళ్ళు మూసుకుని మీరు నిజంగానే అద్భుతంగా మాట్లాడుతున్నట్టు.. ముందు ఉన్న వాళ్ల్లు చప్పట్లు కొడుతున్నట్టు ఊహించుకోండి. ఇలా చెయ్యడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది.

3. మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నంత సేపు కూడా మీ ఫోకస్ అంతా కుడా మీరు చెబుతున్న టాపిక్ మీదే ఉండాలి. మీ దృష్టి కొంచెం మళ్లిందా .. మొత్తం దెబ్బ తింటుంది. ఎక్కడ ఆపారో గుర్తుండదు. కాబట్టి మీకు స్పీచ్ మధ్యలో ఎటువటిని భంగం కలగకుండా చూసుకోండి. మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చెయ్యండి. వైబ్రేషన్ లో కూడా ఉంచవద్దు.

4. వేగంగా మాట్లాడినంత మాత్రాన గొప్ప వక్త అనిపించుకోము. వేగంగా మాట్లాడినపుడు ఎదుటి వారికి మనం చెప్పింది అర్ధం కాకపోవచ్చు. దాని వల్ల ఉపయోగం ఏముంటుంది? కంగారుగా మాట్లాడి తప్పులు చెయ్యడం కన్నా నెమ్మదిగా మాట్లాడం ఉత్తమం. కాబట్టి నెమ్మదిగా మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ మాట్లాడండి. దీనివల్ల మీకు ఆలోచించుకోవడానికి అలాగే తరువాత మాట్లాడబోయే అంశాన్ని గుర్తుతెచ్చుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది.

5. మీరు స్పీచ్ ఇవ్వవలసి ఉన్నపుడు ముందుగానే ఆ ప్రదేశానికి చేరుకోండి. అక్కడి వాతావరణాన్ని బాగా గమనించి అలవాటు పడండి. అంతేగాని ఆలస్యంగా బయలుదేరి కంగారుగా వెళ్తే ఈ కంగారులో మొత్తం మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత ముందుగానే చేరుకోవడానికి ప్రయత్నించండి.

6. మీరు ఇవ్వబోయే స్పీచ్ ఆసక్తికరంగా ఉండేలా చూసుకోండి. మీ స్పీచ్ బోరింగ్ గా లేకుండా ..మధ్య మధ్యలో నవ్వులు పూయించండి. దీని వల్ల ఆడియన్స్ నవ్వుతూ ఉంటె మీకు కూడా టెన్షన్ పోయి ఇంకా సరదాగా స్పీచ్ ఇవ్వగలరు.

7. యూట్యూబ్ లో గొప్ప వాళ్ళకి సంబంధించిన ఉపన్యాసాలను ఒకసారి చూడండి. వాళ్ళు ఏవిధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ హావభావాలను, కదలికలను గమనించండి. ముఖ్యంగా TED వీడియోలు చూడండి. TED అనేది గొప్ప గొప్ప స్పీకర్స్ మాట్లాడే ఒక వేదిక.. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని గమనించండి. అవి సాధన చెయ్యండి.

8. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట ఎంత ముఖ్యమో మన బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యం. వంగిపోయి, నీరసంగా కాకుండా ధైర్యంగా నిలబడండి. గోక్కోవడం, చేతులు కట్టుకుని ఉండడం, బిగుసుకుపోవడం చెయ్యకుండా…రిలాక్స్ గా ఉంటూ … చేతులు ఊపుతూ, మొఖం మీద చిన్న చిరునవ్వుతో మాట్లాడండి. దీని వల్ల ముందు ఉన్న ఆడియన్స్ కి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

పైన చెప్పిన సలహాలను పాటిస్తూ… ప్రాక్టీస్ చెయ్యండి. అవకాశం దొరికినప్పుడల్లా నలుగురి ముందు మాట్లాడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని..గొప్ప వక్త గా మారండి.

 

You May Like:

How to Earn Money Online

Write For Telugu Badi

 

Please Share with Your Friends  : )

7 thoughts on “How to Overcome Stage Fear -8 ways to conquering Stage Fright

 • October 27, 2018 at 2:05 am
  Permalink

  చాలా మంచి విషయం చెప్పారు brother మీకు thanks

  Reply
 • October 27, 2018 at 5:54 am
  Permalink

  Tanq Bro…Super

  Reply
 • October 28, 2018 at 4:03 am
  Permalink

  Thank you brother it’s good information

  Reply
 • October 30, 2018 at 8:18 am
  Permalink

  Good information thanqqq….keep it up brother

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial