Stock Market Terms You Must Know in Telugu – Telugu badi

స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా వాడే పదాలు :

మనం Stock Market గురించి నేర్చుకునే క్రమంలో కొన్ని పదాలను ఎక్కువగా వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం . ఆ పదాలకు అర్ధం తెలుసుకుంటే నేర్చుకునే ప్రక్రియ సులభంగా ఉంటుంది . మరి స్టాక్ మార్కెట్ లో తప్పకుండా తెలుసుకోవలసిన పదాలేంటో ఇప్పుడు చూద్దాం .

Basic Stock Market Terms for Beginners: 

బ్లూ చిప్ స్టాక్ (BlueChip Stocks) :

ఏదైనా కంపెనీ ఎప్పటి నుండో ఉండి, దాని మార్కెట్ క్యాపిటల్ వేల కోట్లలో ఉండాలి. అలాగే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినవాళ్ళకి లాభాలను , క్రమం తప్పకుండా డివిడెండ్ ని అందిస్తూ , నమ్మకం గా పనిచేస్తూ, దేశ విదేశాలలో విస్తరించి ఉన్న కంపెనీలకు సంబందించిన షేర్లను ” బ్లూ చిప్ స్టాక్ ” అని అంటారు. Reliance Industries, ITC, Infosys, TCS వంటి కంపెనీలను బ్లూ చిప్ స్టాక్స్ కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

పెన్నీ స్టాక్స్ (Penny Stocks) :

ఒక కంపెనీ షేర్ ధర  10 రూపాయల లోపు ఉన్నా , లేదా ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్ల లోపు ఉన్నట్లయితే ఆ కంపెనీ షేర్లను పెన్నీ స్టాక్స్ అంటారు.

వాల్యూమ్  (Volume):

వాల్యూమ్ అంటే ఒక కంపెనీకి సంబందించిన షేర్లు ఒక రోజులో ఎన్ని ట్రేడ్ అయ్యాయో లేదా ఎన్ని షేర్లు చేతులు మారాయో అంటే ఎన్ని షేర్లు అమ్మడం కొనడం జరిగిందో దానిని వాల్యూమ్ (Volume) అని అంటారు. ఉదాహరానికి ఈ రోజు ఐటీసీ కంపెనీ చార్ట్ ని చూసినప్పుడు వాల్యూమ్ 1000000 అని ఉందనుకుందాం . దాని అర్ధం ఆ రోజు 10 లక్షల షేర్లు చేతులు మారాయి అని అర్ధం.

 

52 week high:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యధిక ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అత్యధిక ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

 

52 week low:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యల్ప ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అతి తక్కువ ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

 

All time high:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యధిక ధర (High Price) వరకు చేరుకుందో దానిని All time high అని అంటారు.

 

All time low:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యల్ప ధర (Low Price) వరకు చేరుకుందో దానిని All time low అని అంటారు.

ఇవి Stock Market లోకి ప్రవేశించాలనుకునేవారు తెలుసుకోవాల్సిన Basic Stock Market Terms.

 

You May Like:

Demat Account Open చెయ్యడం ఎలా?

IPO అంటే ఏమిటి? 

stock market open demat aacout

Please Share with Your Friends : )

3 thoughts on “Stock Market Terms You Must Know in Telugu – Telugu badi

  • September 30, 2018 at 4:28 am
    Permalink

    hello super
    inka stock market sambandhinchina web site lo pettandi
    note . eps, roe pe ratio formulas web site lo pettandi sir and fundamental analysis

    Reply
  • September 30, 2018 at 6:25 pm
    Permalink

    we want more about stock markets please.

    Reply
  • October 9, 2018 at 10:15 am
    Permalink

    Hii brother
    Index funds gurinchi chepandi

    Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial