జీవితం చివర్లో మనల్ని ఎక్కువగా బాధపెట్టే అంశాలు

Things You Will Regret When You are Old. 

వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జీవితం చివరి దశలో మనకు తోడుగా ఉండేది మన జీవితానికి సంబందించిన జ్ఞాపకాలే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలు ఆనందాన్ని ఇస్తాయి. కానీ కొన్ని మనం చేయాలనుకుని చేయలేకపోయిన అంశాలు మాత్రం మనల్ని చాలా బాధ పెడతాయి. అలా చాలా మంది జీవితంలో తాము చేయలేక బాధపడిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది యువకులకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇప్పడు చెప్పబోయే అంశాలన్నీ యువకులుగా ఉన్నపుడు మాత్రమే చెయ్యగలం.

 

1. ఇష్టం లేని జాబ్ చెయ్యడం:

మనం సుమారుగా 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉద్యోగం చెయ్యడంలోనే గడిచిపోతుంది. అంటే మన జీవితంలో ఎక్కువ భాగం ఉద్యోగానికి కేటాయిస్తాం. అటువంటిది మనకు నచ్చని జాబ్ లేదా నచ్చని రంగం లో పనిచేస్తే ఆ జీవితంలో ఆనందం ఉండదు. మనలో చాలా మందికి చేసే పని ఇష్టం లేక రొటీన్ గా , బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. చేసే పనిలో ఆనందం లేనప్పుడు మనం సంపాదించినా అర్ధం ఉండదు. కాబట్టి మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంటుందో, ఏ పనిలో ఆనందం దొరుకుతుందో ఆ పనే చెయ్యండి.

 

2. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం:

మనలో చాలా మంది ప్రతి దానికి ఇతరులు ఏమనుకుంటారో అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఉన్న ఒకేఒక్క జీవితం దానిని ఇతరుల కోసం జీవించకండి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. కొంతమంది కనీసం పక్కవారిని ‘టైం ఎంత’ అని అడగడానికి, బస్సు సీట్ లో కూర్చున్న వ్యక్తిని కొద్దిగా పక్కకు జరగమని అడగడానికి, కొత్త బట్టలు వేసుకుని నలుగురిలోకి వెళ్ళడానికి ఇలా ప్రతిదానికి మొహమాటపడుతూ, ఇతరులు మన గురించి ఏమనుకుంటారోనని మనం ముందే ఏవేవో ఊహించేసుకుంటాం. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు తప్ప, పనులు మానుకుని మనల్ని గమనించరు కదా. ! ఇలా పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించేవారు తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా గడపలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన పక్కన పెట్టండి.

 

3. కుటుంబ సభ్యులతో సమయం గడపకపోవడం:

ఈ రోజుల్లో కొంతమంది ఎప్పుడు చూసిన చివరకి భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్ తో ఉంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడమే మానేశారు. చివరికి మీ తల్లిదండ్రులతో సరదాగానవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో ఆలోచించండి. వాళ్ళు ఉన్నంత వరకు వారి విలువ మనకి తెలియదు. ఒకసారి దూరమైన తరువాత అప్పడు చెయ్యడానికి ఏ అవకాశం ఉండదు. కాబట్టి వాళ్లతో ఎక్కువగా గడపండి. వాళ్ళకి మించిన అంతకు అనందం ఏమి ఉండదు.

 

4. మనకంటూ సమయం కేటాయించకపోవడం:

ఈ బిజీ లైఫ్ లో పడి ఎవరూ కూడా తమకు తాము సమయం కేటాయించుకోవడం లేదు. మనందరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటికోసం ప్రతిరోజూ కనీసం కొంత సమయం కేటాయించాలి. కనీసం రోజుకి ఒక గంట అయినా సరే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి ఒక కొత్త బాష నేర్చుకోవడం, రోజూ వ్యాయామం చెయ్యడం, పుస్తకాలు చదవడం మొదలయినవి. అలాగే ప్రతిరోజు కనీసం 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుని మనతో మనం మాట్లాడుకోవాలి.

 

5. విహార యాత్రలకు వెళ్లకపోవడం:

యువకులుగా ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి. ఇలా స్నేహితులతో కలిసి చేసిన ప్రయాణాలు ఎప్పటికి మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలను, అనుభవాలను మిగుల్చుతాయి. కొంతకాలం తరువాత కుటుంబ బాధ్యతలు, చాలీచాలని జీతాలు, ఇతరత్రా కారణాల వల్ల స్నేహితులతో కలిసి టూర్ లు వేసే అవకాశం లభించకపోవచ్చు. కాబట్టి బాధ్యతలు మొదలయ్యేలోపు సాధ్యమైనంత ఎక్కువగా ప్రపంచాన్ని చుట్టేయాలి. లేకపోతె మీరు చెప్పుకోవడానికి మీకంటూ ఏమి మిగలవు.

 

ఒకవేళ మీరుకూడా పైన చెప్పిన తప్పులు చేస్తుంటే వెంటనే సరిదిద్దికోండి. ఎందుకంటే వృద్దాప్యంలో జీవితాన్ని మంచి జ్ఞాపకాలతో గడపాలి కానీ తీరని కోరికలతో కాదు. కాబట్టి ఆనందాలను ఇచ్చే జ్ఞాపకాలను పెంచుకోండి. ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి.

 

You May Like:

జీవితాన్ని మార్చగలిగే కొన్ని పుస్తకాలు

తుఫాన్ (Cyclones) లకి పేర్లు ఎలా పెడతారు? 

5 thoughts on “జీవితం చివర్లో మనల్ని ఎక్కువగా బాధపెట్టే అంశాలు

 • December 18, 2018 at 5:46 am
  Permalink

  Very nice Anna

  Reply
 • December 18, 2018 at 1:54 pm
  Permalink

  Bro you are really great

  Reply
 • December 28, 2018 at 1:04 am
  Permalink

  Thank you bro for giving much knowledge to us through this website

  Reply
 • December 29, 2018 at 3:23 pm
  Permalink

  No words only fasak

  Reply
 • January 14, 2019 at 12:41 pm
  Permalink

  Anna why was the ash in colour of white? Please replay

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial