Trade Mark Symbols -® and ™ R and TM in Telugu

What is the Difference Between TM (Trade Mark) and R (Registered): 

మనం ఏదైనా కంపెనీ లోగో ని చూసినప్పడు దాని పక్కనే చిన్నగా ఒక సర్కిల్ లో R (®) అని గాని లేదా TM (™) అని గాని ఉండడం చూసే ఉంటాం . వీటిని Trade Mark సింబల్స్ అని అంటారు. సాధారణంగా ఒక పేరు గాని, లేదా ఒక స్లోగన్ గాని ఫలానా సంస్దకి చెందినది అని తెలపడం కోసం ఈ సింబల్స్ ని వాడతారు ఈ సింబల్స్ కనుక ఉన్నాయి అంటే దాని అర్ధం ఆ పేరుని గాని, లేదా ఆ స్లోగన్ ని గాని మరెవ్వరు వాడకూడదు. ఒకవేళ వాడినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

 

TM కి, R సింబల్ కి మధ్య తేడా ఏమిటి?

ఉదాహరణకి ఒక సంస్ద ‘ABCDE‘ అనే పేరుని తనదిగా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంది. దాని కోసం వాళ్ళు గవర్మెంట్ కి TradeMark కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళకి గవర్నమెంట్ ఒక Acknowledgment రిసిప్ట్ ఇస్తుంది. అయితే గవర్నమెంట్ కి అప్లై చేసినప్పటి నుండి వాళ్ళు ‘ABCDE’ పక్కన TM అనే ట్రేడ్ మార్క్ ని ఉంచుకోవచ్చు. ఇక్కడ కేవలం ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేసారు అంతే కానీ ఇప్పటికి ఇంకా ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అవ్వలేదు.

ఇలా అప్లై చేసిన తరువాత ఆ పేరు మీద రిజిస్టర్ మార్క్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి 18 నుండి 24 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఈ పేరుని ఇంతకు ముందే ఎవరైనా ఎక్కడైన రిజిస్టర్ చేసుకున్నారేమో చెక్ చేస్తుంది. ఒకవేళ ఎవరు రిజిస్టర్ చేసుకోకపోతే, అన్ని క్లియర్ గా ఉంటె ‘ABCDE’ నేమ్ కి రిజిస్టర్ మార్క్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు TM సింబల్ తీసి R సింబల్ పెట్టుకోవచ్చు, లేదా TM సింబల్ నే కంటిన్యూ చేసుకోవచ్చు, కొన్ని కంపెనీ లు అయితే తమ బ్రాండ్ నేమ్ Registered అయినా సరే TM లేదా R లాంటి సింబల్స్ ని ఉంచుకోవు.

కాబట్టి R అంటే Registered Trade Mark అని, TM అంటే Un Registered Trade Mark అని అర్ధం.

 

You May Like:

TRP అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏమి చెయ్యాలి?

 

 

Please Share with Your Friends : )

2 thoughts on “Trade Mark Symbols -® and ™ R and TM in Telugu

  • September 30, 2018 at 9:28 am
    Permalink

    Anna make in India gurinchi kuda oka video cheyi

    Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial