Why are Planets Round?-గ్రహాలన్నీ గుండ్రంగానే ఎందుకుంటాయి?
Why Are Planets Round?
మన విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు కూడా గుండ్రంగానే ఉంటాయి కానీ క్యూబ్ షేప్ లో గాని పిరమిడ్ షేప్ లో గాని లేదా మరే ఇరత ఆకారాలలో ఉండకపోవడానికి కారణం .. గ్రావిటీ(Gravity). ఆ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుండి కూడా సమానంగా లోపలి లాక్కుంటూ ఉంటుంది. ఇలా అన్ని వైపులా నుండి సమానంగా ఆకర్షణ శక్తి ప్రయోగించబడడంతో వాటికి గుండ్రంటి ఆకారం అనేది వస్తుంది.
అందుకే మీరు గ్రహం మధ్యభాగం నుండి ఉపరితలం లోని ఏ ప్రదేశాన్ని తీసుకున్న సమన దూరం ఉంటుంది. కారణం ఆకర్షణ శక్తి (Gravitaional Force) అన్ని వైపులకు సమానంగా ప్రయోగించబడుతుంది
ఉదాహారానికి అదే క్యూబ్ షేప్ లో ఉందనుకుందాం. ఇప్పుడు సెంటర్ నుండి సైడ్స్ కన్నా కార్నర్స్ ఎక్కువ దూరంగా ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్(Gravitaional Force) అనేది అన్ని వైపులకు సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ప్రదేశం దూరంగా ఒక ప్రదేశం దగ్గరగా ఉండడం అనేది సాధ్యం కాదు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా పూర్తిగా గుండ్రంగా ఉండవు. మధ్యభాగం లో కొద్దిగా సాగి ఉంటాయి కారణం కొన్నిగ్రహాలు అత్యంత వేగంగా వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండడంవల్ల అపకేంద్ర బలం(Centrifugal Force) కారణంగా అక్షరేఖ దగ్గర కొద్దిగా బయటకు సాగి ఉంటుంది దీనినే Equatorial bulge అని అంటారు. ఉదాహరణకి మన భూమి కూడా అత్యంత వేగంగా తన చుట్టూ తానూ తిరుగుతూ ఉండడం వలన అపకేంద్ర బలం(Centrifugal Force) కారణంగా మన భూమికి 42.72 కిలోమీటర్ల Equatorial bulge ఉంది.
You May Like:
Black Hole (బ్లాక్ హోల్) అంటే ఏమిటి?
Please Share with Your Friends : )
Hi bro .chusi artham chesukune variki YouTube videos
Chadhivi artham chesukune vallaki website. Chala bagundhi super my support nikuntundhi
Thank you so much
Thank u for giving facts to me
Bro please make a video on Byju Raveendran (inspiration)