ratan-tata-telugu

How to Earn Money from YouTube in Telugu

How to Make Money on YouTube:

YouTube... కొంతమంది టైం పాస్ కోసం వీడియోలు చూస్తుంటే,మరికొంతమంది మాత్రం అదే యూట్యూబ్ ద్వారా వేలు, లక్షలు సంపాదిస్తున్నారు.కొందరు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ని, మరికొందరు వాళ్ళకి తెలిసిన విషయాలను వీడీయోలుగా తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండి, మీ వీడియోలను ఎక్కువ మంది చూస్తున్నట్లైతే మీరు కూడా యూట్యూబ్ నుండి మనీ సంపాదించవచ్చు. అసలు యూట్యూబ్ నుండి మనీ ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

YouTube Channel ఎలా క్రియేట్ చేసుకోవాలి?

1. YouTube Partner Program అంటే యూట్యూబ్ లో ఛానల్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు .. వాళ్ళ వీడియో నుండి డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్ తో ఒప్పందం కుదుర్చుకోవడమే ఈ YouTube Partner Program.

ముందుగా అసలు యూట్యూబ్ నుండి మనీ వస్తుందో చూద్దాం. మీరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి గమనించారా? ఆ యాడ్స్ వల్లనే మనకు మనీ వస్తుంది అది ఎలాగో తెలుసుకుందాం.

ఉదాహరణకి మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు Apple కంపెనీ కి సంబందించిన ఒక యాడ్ ప్లే అయ్యింది అనుకుందాం. సాధారణంగా Apple కంపెనీ తమ యాడ్ ని ప్లే చెయ్యమని యూట్యూబ్ కి మనీ ఇస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ ఆపిల్ కంపెనీ నుండి తీసుకున్న డబ్బులో కొంత, ఏ వీడియోల మీద అయితే Apple యాడ్ ప్లే అయ్యిందో ఆ వీడియో లు అప్లోడ్ చేసినవాళ్లకు ఇస్తుంది.

అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోల మీద యాడ్స్ ప్లే అయితే మనకు మనీ వస్తుంది అన్నమాట. అయితే మన ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోల మీద యాడ్స్ రావాలంటే Monetization అనే ఆప్షన్ Enable అవ్వాలి. కానీ యూట్యూబ్ ఈ మధ్యన YouTube Partner Program లో కొత్త మార్పులు తీసుకువచ్చింది. అవేంటంటే:



1. ఛానల్ కి 1000 మంది Subscibers ఉండాలి.

2. గత 12 నెలలలో ఛానల్ మొత్తం watch time 4000 గంటలు దాటి ఉండాలి.

( Watch Time అంటే మీ వీడియోలను viewers ఎంత సేపు చూసారో తెలిపేదే watch time. ఉదాహారానికి మీరు ఒక 5 నిముషాలు ఉన్న వీడియో ని అప్లోడ్ చేసారు. ఆ వీడియోని 100 మంది పూర్తిగా చూసినట్టలైతే ఆ వీడియో watch time (100 X 5 min ) 500 నిముషాలు అవుతుంది. మీ ఛానల్ watchtime ఎంత ఉంది అనేది Youtube లోని Analytics అనే option లో చెక్ చేసుకోవచ్చు)



ఉదాహారానికి పై ఫోటో లో watch time 2,71,369 నిముషాలు ఉంది. దీనిని గంటలలోకి మారిస్తే (2,71,369/60) సుమారుగా 4522.8 గంటలు. అంటే watch time 4000 గంటలు పైనే ఉంది.

యూట్యూబ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ వల్ల కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి ఇబ్బంది అనే చెప్పాలి. కానీ దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు.కొంచెం ఓపికతో మంచి వీడియోలు చేస్తే 4000 గంటల watch time సులభంగానే పొందవచ్చు.

ఒక్కసారి మన ఛానల్ కి కనుక 1000 subscribers మరియు "4000 hours" watch time వచ్చినట్లైతే ఆ తరువాత మనం Monetization కోసం apply చేసుకోవాలి. అప్పుడు YouTube మన ఛానల్ ని రివ్యూ చేసి మన ఛానల్ కి Monetization ఇస్తుంది. అప్పటి నుండి మన ఛానల్ లోని వీడియోల మీద యాడ్స్ ప్లే అవుతాయి. ఈ విధంగా మనకి యూట్యూబ్ నుండి మనీ రావడం జరుగుతుంది. అలా మన ఛానల్ కి వచ్చిన views మరియు వాటి మీద ప్లే అయిన యాడ్స్ ఆధారంగా యూట్యూబ్ మనకు మనీ ఇస్తుంది.

2.Sponsorships:

యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడానికి ఉన్న మరొక మంచి Sponsorships. అంటే మీ ఛానెల్ కి ఎక్కువ మంది subscibers మరియు మీ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ కనుక ఉంటె కొన్ని కంపెనీలు తమ ప్రోడక్ట్ ని ప్రమోట్ చెయ్యమని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. మీరు ఆ ప్రోడక్ట్ గురించి మీ వీడియోలో చెప్తారు. అందుకుగాను ఆ కంపెనీలు మీకు మనీ పే చేస్తాయి. కొన్ని పెద్ద పెద్ద చానెల్స్ అయితే ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినందుకు గాను కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాయి.

అయితే ఈ విధంగా మన ఛానల్ కి Sponsorships రావాలంటే ఎక్కువ మంది subscibers ఖచ్చితంగా ఉండాలి.

ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మనం మనీ సంపాదించవచ్చు. అయితే ముందు డబ్బు గురించి కాకుండా ఆడియన్స్ కి మంచి వీడియోలు అందించడం కోసం ప్రయత్నించండి. ఒక్కసారి ఛానల్ కనుక మంచి స్థాయికి చేరుకుంటే డబ్బు దానికదే వస్తుంది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+