ratan-tata-telugu

Mutual Funds in Telugu-మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

What is Mutual Fund:

మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds):

మ్యూచువల్ ఫండ్ అంటే ఒకే ఆర్థిక లక్ష్యం కలిగినటువంటి కొంతమంది పెట్టుబడిదారుల నుండి డబ్బుని సేకరించడం కోసం ఏర్పడిన ఒక ట్రస్ట్. ఇక్కడ పెట్టుబడిదారులందరి లక్ష్యం ఏమిటి? డబ్బుని పెట్టుబడిగా పెట్టడం దాని నుండి లాభాలు పొందడం. ఇలాంటి పెట్టుబడిదారులందరి నుండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బుని సేకరిస్తుంది. ఈ మొత్తం మ్యూచువల్ ఫండ్ కి మార్కెట్ మీద మంచి నైపుణ్యం ఉన్నటువంటి కొంతమంది ఫండ్ మేనేజర్స్ గా ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్స్ ఇలా పెట్టుబడిదారులందరి నుండి సేకరించిన డబ్బుని స్టాక్స్ (Stocks), గోల్డ్(Gold), బాండ్స్(Bonds), డిబెంచర్స్(Debenture) డెట్ పథకాలు(Debt) వంటి వివిధరకాల పెట్టుబడి సాధనలలో ఇన్వెస్ట్(Invest) చేస్తారు. దాని ద్వారా వచ్చిన లాభాలను ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరికీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఆధారంగా పంచడం జరుగుతుంది.

మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) అనేవి సామాన్య మానవునికి అనుకూలమైన పెట్టుబడి సాధనం. ఎందుకంటే కొంతమందికి స్టాక్ మార్కెట్(Stock Market) లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఉండదు. కొంతమందికి స్టాక్ మార్కెట్ ని పరిశీలించడానికి సమయం ఉండదు, కొంతమంది పెట్టుబడి పెట్టిన ఎక్కువ రిస్క్(Risk) తీసుకోలేరు. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తం లో ఇన్వెస్ట్ చెయ్యలేరు ఇటువంటి వారందరికీ ఈ మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) అనేవి బాగా ఉపయోగపడతాయి.

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం వలన లాభాలు:

భద్రత: మ్యూచువల్ ఫండ్స్ ని పెద్ద పెద్ద బ్యాంకులు, ట్రస్ట్ లు నిర్వహిస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన SEBI(Securities and Exchange Board of India) వద్ద రిజిస్టర్ అయ్యి సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ని ఈ సెబీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు.

పారదర్శకత: ఒక పెట్టుబడిదారునిగా మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టబడిందో, ప్రస్తుతం దాని విలువ ఎంత ఉంది వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడతాయి.

సులభతరం: మ్యూచువల్ ఫండ్స్ లో మీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న రెండు లేదా మూడు రోజుల్లో మీ డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి వస్తుంది.

చిన్న మొత్తాల పొదుపు: మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒకేసారి ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెల కొద్దీ కొద్దిగా మీరు ఎంత వరకు పొదుపు చేయగలరో అంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చిన్న చిన్న పొదుపులన్నీ కలిపి చక్రవడ్డీ సూత్రం ప్రకారం భవిష్యత్తులో ఎక్కువ సంపదను సృష్టిస్తుంది.

విస్తరణ: పెట్టిన పెట్టుబడిని ఏదో ఒక కంపెనీలో కాకుండా వివిధ రంగాలలో పెట్టుబడిగా పెట్టడం వలన ఒక దానిలో నష్టం వచ్చినా, మరొక దానిలో వచ్చిన లాభం దానిని కవర్ చేస్తుంది. దీనివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది.



ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.

Types of Mutual Funds:

మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి:

1. ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్(Open-Ended Mutual Fund)

2. క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్ (Closed-Ended Mutual Fund)

1. ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్:

ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్ అంటే వీటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ లు ఏ సమయంలో అయినా సరే ఈ ఫండ్ నుండి బయటకు రావచ్చు. అలాగే కొత్త ఇన్వెస్టర్ లు కూడా ఏ సమయంలో అయినా సరే ఈ ఫండ్స్ లోకి ప్రవేశించవచ్చు. వీటికి నిర్దిష్టమైన సమయం గాని లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఏమి ఉండదు.

2. క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్:

క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్ లో మనం పెట్టిన పెట్టుబడిని ఎపుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వీటికి ఒక నిర్దిష్టమైన లాక్ ఇన్ పీరియడ్ సమయం ఉంటుంది. అప్పటి వరకు కూడా మన పెట్టుబడిని ఈ ఫండ్స్ లో కొనసాగించవలసి ఉంటుంది.

వీటిలో మనకు ఏ ఫండ్స్ అనుకూలంగా ఉన్నాయో పరిశీలించి వాటిలో పెట్టుబడి(Invest) పెట్టడం మంచిది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+