ratan-tata-telugu

How to Earn Money Online in Telugu-Best Ways to Make Money

Best Ways to Earn Money Online:

చదువుకుంటూనో, ఉద్యోగం చేస్తూనో online ద్వారా Extra income సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అది చాలా అవసరం కూడా... ప్రతి ఒక్కరికి Second Income source ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రయత్నం లో చాలామంది   ఆన్ లైన్ లో ఏవేవో website లలో ads మీద క్లిక్ చెయ్యడం, Apps Install చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని Genuine ఉంటాయి. అయినా గాని వీటిలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా Genuine గా మనీ ఇస్తూ ... మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే మార్గాలు కూడా ఆన్ లైన్ లో చాలా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీటిలో మీకు ఏది సరిపోతుందో , అనుకూలంగా ఉంటుందో చూసుకుని ఆ మార్గంలో కాస్త ఓపికతో కొంచెం కష్టపడండి. తప్పకుండ ఫలితం ఉంటుంది.

బ్లాగ్ లేదా వెబ్ సైట్ ని స్టార్ట్ చెయ్యడం:

మీరు ఏదైనా ఒక website ని open చేసిననపుడు ఆ website లో పక్కన గూగుల్ కి సంబందించిన కొన్ని యాడ్స్ కనపడుతుంటాయి గమనించారా. ఇలా ఆ website లో గూగుల్ యాడ్స్ display చేసినందుకు గూగుల్ కంపెనీ ఆ వెబ్ సైట్ వాళ్ళకి మనీ ఇస్తుంది. కాబట్టి మీకు ఇంట్రస్ట్ ఉన్న ఒక టాపిక్ మీద ఒక website ని స్టార్ట్ చేసి గూగుల్ Adsense తో కనెక్ట్ చేసుకోండి. ఆ తరువాత మీ వెబ్ సైట్ కి ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయో అంత మనీ మీకు వస్తుంది.వెబ్ సైట్ ని స్టార్ట్ చెయ్యడం పెద్ద కష్టమైనపనేమీ కాదు. చాల సులభంగా మీకు మీరే వెబ్ సైట్ ని create చేసుకోవచ్చు వెబ్ సైట్ ని ఎలా స్టార్ట్ చెయ్యాలి. ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏమి చెయ్యాలి అనేది ముందు ముందు మరింత వివరంగా తెలుసుకుందాం.

యూట్యూబ్ లో వీడియోస్ upload చెయ్యడం:

YouTube అంటే ఖాళీ సమయంలో ఏదో సరదాగా వీడియోలు చూసే website గానే చాల మందికి తెలుసు. కానీ యూట్యూబ్ కూడా ఆన్ లైన్ లో మనీ సంపాదించడానికి ఒక మంచి మార్గం. యూట్యూబ్ అనేది గూగుల్ కి సంబందించిన కంపెనీ. కాబట్టి యూట్యూబ్ లో మనీ వస్తుందో రాదో అనే అనుమానం అవసరం లేదు. మీరు చెయ్యవలసిందల్లా జనాలకు నచ్చే మంచి మంచి వీడియోలను చేసి వాటిని యూట్యూబ్ లో upload చెయ్యడం. ఒకవేళ మీకు యాక్టింగ్ ఇంట్రస్ట్ ఉంటె shortfilms తీయవచ్చు. లేదా మీరు ఏదో ఒక రంగంలో expert అయితే వాటిని tutorial గా వీడియోలు చేసి upload చెయ్యవచు. మనం యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్య లో యాడ్స్ ప్లే అవుతుంటాయి. ఆ యాడ్స్ ద్వారా ఆ వీడియో uplaod చేసినవాళ్ళకి యూట్యూబ్ మనీ ఇస్తుంది. మీ వీడియోస్ కి వచ్చే views ని బట్టి మీ ఆదాయం కూడా ఉంటుంది.

Affliate marketing:

Affliate Marketing అంటే వేరే వాళ్ళ వస్తువులను మీరు ప్రమోట్ చేసి అమ్ముతారు. అలా అమ్మినందుకు మీకు కొంత కమిషన్ వస్తుంది. ఉదాహరణకి మీకు ఒక టెక్నాలజీకి సంబందించిన website గాని YouTube Channel గాని ఉందనుకోండి. వాటిలో మీరు కొత్తగా విడుదలైన ఒక ఫోన్ గురించి వివరిస్తూ.. ఆ ఫోన్ కొనమని చెప్పి ఆ ఫోన్ కి సంబందించిన లింక్ ని ఇస్తారు. మీ ఆర్టికల్ చదివిన వాళ్ళు లేదా మీ వీడియో చుసిన వాళ్లలో ఎవరైనా మీరు ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఫోన్ ని కొంటె ఆ ఫోన్ కాస్ట్ లో కొంత % మనీ మీకు కమిషన్ గా వస్తుంది. అలా ఎంత మంది కొంటె అంత కమిషన్ అన్నమాట. కాని దీని ద్వారా మనీ సంపాదించాలంటే ముందు మీకంటూ ఒక పెద్ద నెటవర్క్ ఉండాలి. వాళ్ళకి మీ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాళ్ళు మీరు చెప్పిన ప్రొడక్ట్ ని కొంటారు. అంతే కాదు మీరు ఏదైనా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసే ముందు మంచి నమ్మకమైన వాటిని మాత్రమే ప్రమోట్ చెయ్యాలి, లేకపోతె ప్రజలకు మీ మీద నమ్మకం పోతుంది.

Freelancer గా పనిచెయ్యడం:

Freelancing అంటే మీలో ఏదైనా ఒక స్కిల్ గాని టాలెంట్ గాని ఉంటె, వాటితో అవసరం ఉన్నవాళ్లు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ని మీరు పూర్తి చేస్తారు. అందుకుగాను వాళ్ళు మీకు కొంత మనీ ఇస్తారు. ఉదాహరణకి మీరు ఏ టాపిక్ గురించి అయినా బాగా వ్రాయగలరు అనుకుందాం. అప్పుడు మీరు ఏదైనా website కి ఆర్టికల్స్ రాసి ఇస్తారు. అలాగే మీరు లోగో లు బాగా క్రియేట్ చెయ్యగలరనుకోండి. ఎవరికైనా లోగో కావాల్సి ఉంటె వాళ్ళకి లోగోని డిజైన్ చేసి ఇస్తారు. అలాగే ఫొటోస్ గాని వీడియోలు గాని ఎడిటింగ్ చెయ్యడం, software coding వ్రాయడం, వెబ్ సైట్ డిజైన్ చెయ్యడం ఇలా మీలో ఏ స్కిల్ ఉన్న దాని ద్వారా మనీ సంపాదించవచ్చు.

Upwork, Fiverr, Freelancer, Guru, PeopleperHour ఇవన్నీ కూడా Freelancer గా పనిచేయడానికి మంచి వెబ్ సైట్లు.

Sponsored Posts చెయ్యడం:

Sponsored Post అంటే ఉదాహరణకి మీకు టెక్నాలజీకి సంబందించిన ఒక వెబ్ సైట్ గాని లేదా సోషల్ మీడియా లో అంటే Facebook, Twitter, Instragram వంటి వాటిలో ఒక టెక్నాలజీ పేజీ గాని ఉండి ఆ పేజీ కి ఎక్కువ మంది Followers ఉన్నట్లయితే కొన్ని టెక్ కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యమని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి. అలాగే హెల్త్ గాని, ఫైనాన్స్ గాని, ఫ్యాషన్ గాని ఇలా ఏ రంగానికి సంబందించిన పేజీ ఉంటె ఆ రంగాలకు చెందిన కంపెనీ వాళ్ళు, వాళ్ళ ప్రొడక్ట్స్ కి సంబందించిన పోస్ట్ పెడితే వాళ్ళు మీకు కొంత మనీ ఇస్తారు. కనీసం మీ పేజీకి లక్షకి పైగా Followers ఉంటె మీకు ఎక్కువ అమౌంట్ రావచ్చు.

ఉదాహారానికి మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి Instragram లో కొన్ని కోట్ల మంది Follwers ఉన్నారు. తాజాగా Instragramలో ఒక కంపెనీకి సంబందించిన ఒక పోస్ట్ పెట్టినందుకు ఆ కంపెనీ వాళ్ళు కోహ్లీకి ఏకంగా 82,00,000 రూపాయలు చెల్లించారు. కేవలం ఒక ఫోటో పెట్టినందుకు 82 లక్షల రూపాయలంటే ఊహించుకోండి. కానీ అందరికి ఇదే విధంగా ఉంటుందని చెప్పడం లేదు. Followers ని బట్టి అమౌంట్ ఉంటుంది.

కోర్స్ లు తయారు చెయ్యడం:

మీకు ఏదో ఒక సబ్జెక్టు గురించి లేదా టాపిక్ గురించి పూర్తిగా తెలిస్తే మీరు స్వయంగా ఒక కోర్స్ ని create చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకి మీరు వీడియో ఎడిటింగ్ బాగా చెయ్యగలరు. అప్పుడు వీడియో ఎడిటింగ్ ఎలా చెయ్యాలి అనేది అర్థమయ్యేలా వివరిస్తూ వీడియోల రూపంలో ఒక కోర్స్ ని create చెయ్యవచు. అది ఏ భాషలో అయినా కావచ్చు. ఇలా ఒక కోర్స్ ని తయారుచేసి udemy వంటి వెబ్సైట్ లలో upload చేస్తే ఎవరైనా ఆ కోర్స్ ని కొనుక్కున్న ప్రతిసారి మీకు అమౌంట్ వస్తుంది. దీనిలో ఉన్న ముఖ్యమైన లాభం ఏమిటంటే కేవలం మీరు ఒక్కసారి కోర్స్ తయారుచేస్తే చాలు ... ఎవరో ఒకరు ఏదో ఒకసమయంలో ఆ కోర్స్ ని కొన్నప్పుడల్లా మీకు మనీ వస్తూనే ఉంటుంది.

ఈ మార్గాలన్నీ కూడా మిమ్మల్ని ఒక్కరోజులోనే ధనవంతులుగా మార్చవు. కొంతకాలం పాటు ఓపికగా కష్టపడాలి. ఒక్కసారి మీరు కనుక వీటిలో సక్సెస్ అయితే మీరు వెనుదిరిగి చూడనవసరం లేదు. కాబట్టి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఆలోచించి ఎంచుకోండి. దాని గురించి పూర్తిగా నేర్చుకోండి. కొంచెం కష్టపడండి తప్పకుండ సక్సెస్ అవుతారు.All The Best.

మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

Thank You.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+