ratan-tata-telugu

What is TRP in Telugu - How it is calculated? - Telugu Badi

TRP అంటే Television Rating Point. ఏ ప్రోగ్రామ్ ని ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారు, ఏ ఛానల్(channel) కి ఎక్కువ పాపులారిటీ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ TRP అనేది ఉపయోగపడుతుంది.

TRP ని ఎలా లెక్కిస్తారు?

ఈ TRP ని లెక్కించడానికి మన దేశంలో ప్రత్యేకంగా BARC అనే ఒక సంస్థ ఉంది. BARC అంటే Broadcast Audience Research Council. ఈ సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వేల ఇళ్లలో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం ఛానల్ నుండి వచ్చే ఆడియో లోని వాటర్ మార్కింగ్ (Water Marking) ద్వారా ఏ సమయంలో, ఎంత మంది, ఏ ఛానల్ ని చూస్తున్నారో రికార్డు చేసి BARC సర్వర్ లకు పంపుతుంది. ఈ పరికరం ధర చాల ఎక్కువగా ఉండడంవల్ల దేశంలో ఉన్న అన్ని TV లకు వీటిని అమర్చడం కుదరదు కాబట్టి వీటిని కేవలం కొన్ని TV లకు మాత్రమే అమర్చుతారు.

TRP ని ఎలా చెక్ చెయ్యాలి?

మీరు కూడా మన దేశంలో ఏ ఛానల్ కి ఎంత TRP ఉంది లేదా ఏ ప్రోగ్రామ్ ని ఎక్కువ మంది చూస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే http://www.barcindia.co.in/statistic.aspx ఈ వెబ్సైటు లో మీకు కావాల్సిన ఛానల్ కి సంబందించిన డేటా ని పొందవచ్చు.

అసలు TRP ఎందుకు?

సాధారణంగా రకరకాల కంపెనీ వాళ్ళు ఏ ఛానల్ కి ఎక్కువ పాపులారిటీ ఉందొ ఆ ఛానల్ లో లేదా ఏ ప్రోగ్రామ్ ని అయితే ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారో ఆ ప్రోగ్రామ్ కి మధ్యలో తమ యాడ్స్(Advertisement) ని ప్రసారం చెయ్యాలని చూస్తారు. అటువంటి సమయంలో వాళ్ళు ఈ TRP ఆధారంగానే ఛానల్ ని ఎంచుకుంటారు. అలాగే ఏ ఛానల్ కి అయితే ఎక్కువ TRP ఉంటుందో వాళ్ళు తమ ఛానల్ లో యాడ్స్ ప్రసారం చెయ్యడానికి ఎక్కువ డబ్బుని తీసుకుంటారు. TV చానెల్స్ కి వచ్చే ఆదాయమంతా ఈ యాడ్స్ ద్వారానే వస్తుంది. వాళ్ళ ఛానల్ కి ఉన్న TRP పెరిగితే వాళ్ళకి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అందుకోసమే TV చానెల్స్ తమ TRP పెంచుకోవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+