ratan-tata-telugu

How to Create a YouTube Channel in Telugu

How to Create a YouTube Channel:

YouTube అంటే ఖాళీ సమయంలో సరదాగా వీడియోలు చూడడం కోసమే కాదు, మనలో ఉన్న టాలెంట్ ని బయట ప్రపంచానికి తెలియజేస్తూ దాని ద్వారా మనీ కూడా సంపాదించవచ్చు. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తమలోని ప్రతిభను బయటపెట్టుకుంటున్నారు. కొంతమంది తమకొచ్చిన వంటలను చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా ఎవరైనా సరే తమలోని టాలెంట్ ని నిరూపించుకోవచ్చు. ఇలా చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ లక్షలు కాదు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నారు.

ఒకవేళ మీరు కూడా ఇలా యూట్యూబ్ లో వీడియో లు అప్లోడ్ చెయ్యాలనుకుంటే ముందు మీరు ఒక YouTube Channel క్రియేట్ చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమేమి కాదు. మీకు మిరే సులభంగా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీరు యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందు మీకు కచ్చితంగా Gmail అకౌంట్ ఉండాలి. ఆ Gmail తో యూట్యూబ్ లో Sign in అవ్వండి.

మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చెయ్యండి.



తరువాత  మీ అకౌంట్ కి సంబందించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లో క్రింద "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.



ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి.



అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేట్ అయ్యిపోయింది. కానీ మీ ఛానల్ ని మరికొంచెం తీర్చిదిద్దాలి. దానికోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.



ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo మరియు Channel Art ని add చెయ్యండి.



తరువాత About ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇక్కడ మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి. అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.



ఇపుడు మీరు మీ మొదటి వీడియో ని యూట్యూబ్ లో upload చెయ్యాలి అనుకుంటే.. కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.



మరింకెందుకు ఆలస్యం మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యడంలో ఏవైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్స్ ద్వారా తెలపండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+