ratan-tata-telugu

Job Interview Tips in Telugu- How to Win an Interview

Best Job Interview Tips and Preparation:

ఉద్యోగం సంపాదించడం అనేది ప్రతి ఒక్కరి కల. కాకపోతే దానికోసం ముందు ఇంటర్వ్యూ (Interview)అనే ఒక పద్మవ్యూహాన్ని ఛేదించవలసి ఉంటుంది. అయితే చాలా మందికి ఇంటర్వ్యూ లో ఎలా విజయం సాధించాలో తెలియక ఎన్నో ఉద్యోగాలను కోల్పోతూ ఉంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా ఇంటర్వ్యూ లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇంటర్వ్యూ కి నీట్ గా Formal డ్రెస్ వేసుకుని వెళ్ళండి. అంతేగాని చిత్రవిచిత్రమైన దుస్తులతో స్టైల్ గా తయారయ్యి వెళ్లడం, ఒంటి నిండా perfume పూసుకుని, ఆటిట్యూడ్ అని చెప్పి చేతికి బ్యాండ్ లు, తాళ్లు కట్టుకుని వెళ్ళకండి. మిమ్మల్ని చూసిన వెంటనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవారికి ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

2. ఇంటర్వ్యూ రూంలో కి వెళ్తున్నప్పుడు మొఖం మీద చిన్న చిరునవ్వుతో ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించండి. అంతేగాని సీరియస్ గా మొఖం పెట్టి లేదా భయపడుతూ వెళ్ళకండి. వెళ్లిన వెంటనే ఆ సమయాన్ని బట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్ళను Good Morning అనో , Good Evening అనో విష్ చెయ్యండి.

3. మీరు కుర్చీలో కూర్చుంటున్నపుడు కుర్చీని పెద్ద శబ్దం వచ్చేలా వెనక్కి లాగడం చేయకండి. అలాగే నిటారుగా కూర్చోండి. అంతేగాని వంగపోయి కూర్చోవడం లేదా ముందు ఉన్న టేబుల్ మీద చేతులు పెట్టడం చెయ్యకండి.

4. ఇంటర్వ్యూ లో ముఖ్యమైనది మన బాడీ లాంగ్వేజ్. చాలా మంది కూర్చున్నపుడు కాళ్ళు ఊపడం, దిక్కులు చూడడం, ఆవలించడం, జుట్టు సరిచేసుకోవడం, చేతులు కట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి మన మీద చెడు అభిప్రాయాన్ని కలుగచేస్తాయి.

5. ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పండి అంతేగాని ఏదో ఇప్పుడే మర్చిపోయినట్లుగా, గుర్తుకు తెచుకుంటున్నట్టుగా నాన్చడం, నటించడం చెయ్యకండి. మనల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఎంతో మందిని చూసి ఉంటారు.

6. మీరు ఇంటర్వ్యూ కి వెళ్తున్న కంపెనీ గురించి ముందుగానే కొంత సమాచారం తెలుసుకుని వెళ్ళండి. అంటే ఆ కంపెనీ ఎలాంటి వస్తువులను తయారుచేస్తుంది? లేదా ఎలాంటి సేవలను అందిస్తుంది వంటి వాటి మీద మీకు కొంత అవగాహన ఉంటే మంచిది.

7. ఇంటర్వ్యూ లో దాదాపుగా ఒకే రకమైన ప్రశ్నలు ఉంటాయి. " మీ గురించి చెప్పండి", "మీ బలాలు - బలహీనతలు ఏమిటీ?", " ఇంతమందిలో మీకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి?" ఇటువంటి ప్రశ్నలే ఉంటాయి. కానీ మీరు ఇచ్చే సమాధానం, చెప్పే పద్ధతిని బట్టి మీ విజయం ఉంటుంది.

8. రెస్యూమె లోని వివరాలన్నీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మీ రెస్యూమె లో ఉన్నవాటిని బట్టే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మీ స్నేహితుల రెస్యూమె ని కాపీ కొట్టడం, లేని వాటిని ఉన్నట్టుగా చూపించడం వలన తరువాత వారు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక మీరే ఇబ్బంది పడవలసి ఉంటుంది.

9. ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి ముందే ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చెయ్యండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ లో ప్రశ్నలు అడిగినట్టుగా మీరు సమాధానం చెప్తున్నటుగా సాధన చెయ్యండి. దీనివలన అసలు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీకు ముందే తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు.

10. ఇంటర్వ్యూ ముగిసిన తరువాత చివరలో ఇంటర్వ్యూ చేసిన వారికి నవ్వుతూ Thank You అని విష్ చేసి బయటకు రండి. దాని వల్ల మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

పైన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఇంటర్వ్యూ లో విజయం సాధించండి.  All The Best.

Facebook లో తెలుగుబడి పేజీని లైక్ చెయ్యండి:



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

 
ads
+