ratan-tata-telugu

Elon Musk Top 8 Secrets of Success in Telugu

Elon musk Top 8 Secrets of Success

1. కష్టపడి పని చెయ్యండి:

కష్టపడి పని చెయ్యండి.ఇతర వ్యక్తులు వారానికి 40 గంటలు కష్టపడితే మీరు 100 గంటల కష్టపడండి.అంటే సగటున ఇతరుల రోజుకు 6 గంటలు కష్టపడితే మీరు రోజుకు 14 గంటలు కష్టపడండి. అప్పుడు ఇతరులు సంవత్సర కాలంలో సాధించే విజయాన్ని మీరు 4 నెలల్లో సాధించగలుగుతారు. అదనపు హార్డ్ వర్క్ విజయానికి అవకాశాలను పెంచుతుంది మరియు మీ పనులను వేగవంతం చేస్తుంది.

2. యుక్త వయసులో ఉన్నపుడే రిస్క్ లు తీసుకోండి:

మీరు యుక్త వయసులో ఉన్నప్పుడే రిస్క్ లు తీసుకుని మీ కళలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత రిస్క్ తీసుకుంటే దాని యొక్క ప్రభావం కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంది.

అంతేకాకుండా సింగల్ గా ఉన్నప్పుడు సమయం అనేది పూర్తిగా మీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి మీ పూర్తి సమయాన్ని మీ గమ్య సాధనకే వెచ్చించగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు యుక్త వయసులోనే రిస్క్ తీసుకుని పనిచేయండి.

3.భిన్నంగా ఉండటానికి ప్రయత్నించండి:

ఎలాన్ మస్క్ Paypal ఎక్విజిషన్ ద్వారా 180 మిలియన్ డాలర్లను సంపాదించారు. అలా వచ్చిన డబ్బులో 100 మిలియన్ డాలర్లను SpaceX లోనూ, 70 మిలియన్ డాలర్లను Tesla లోనూ మరియు 10 మిలియన్ డాలర్లను Solar City లోను ఇన్వెస్ట్ చేశారు.

అదే 180 మిలియన్ డాలర్లు మన చేతిలో ఉంటే కనుక దానితో మంచి సౌకర్యాలు గల ఇంటిని కొందామా లేదా ఖరీదయిన కారుని కొందామా అని ఆలోచిస్తాం..

అదే మనకి సక్సెస్ ఫుల్ పీపుల్ కి మధ్య ఉన్న తారతమ్యం. మనం మన దగ్గర ఉన్న డబ్బుని మనకి ఆదాయాన్ని తీసుకురాని వాటి మీద ఖర్చు పెడతాం. తెలివైన ఎలాన్ మస్క్ లాంటివాళ్లు ఏవైతే వాళ్లకి తిరిగి మళ్ళీ సంపాదనని తీసుకొస్తాయో అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు.

4. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు:

విద్యకు అంతం లేదు. అపరిమిత జ్ఞానం ఉన్న ఈ ప్రపంచంలో, మీరు నేర్చుకోగలిగే క్రొత్తది ఎల్లప్పుడూ మీకు దొరుకుతూనే ఉంటుంది. ఎలాన్ మస్క్ ఒక పుస్తకాల పురుగు లాంటి వారు. ఆయన చిన్న వయసులోనే బ్రిటన్ కు చెందిన మొత్తం ఎన్సైక్లోపీడియా చదివేసారు అంటే మీరే అర్ధం చేసుకోండి. ఇప్పటికీ కూడా ఆయనకి ఏ కొద్దిపాటి సమయం దొరికినా దానిని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తారట.

పుస్తకాలు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. 'The more you learn, the more you earn.'

5. అభిప్రాయ సేకరణ:

ఈ ప్రపపంచంలో ఏ వ్యక్తి ,ఏ వస్తువు 100% పెర్ఫెక్ట్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఎంత పర్ఫెక్ట్ గా పని చేసినా అందులో అభివృద్ధి చేయాల్సింది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈరోజు చేసిన పనిని రేపు ఇంకా బెటర్ వే లో ఎఫెక్టివ్ గా ఎలా చేయగలను అనే దిశలో మన ఆలోచనలు ఉండాలి. దాని కోసం మీ పని పట్ల తప్పొప్పులు చెప్పే బృందాన్ని మీరు ఏర్పరచుకోవాలి.

6. ఓటమిని గురించిన భయాలను వీడండి:

ఒకానొక సమయంలో టెస్లా కంపెనీ వైఫల్యాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయ్యింది. అయినప్పటికీ ఎక్కడా దిగులుకు తావు లేకుండా అనుక్షణం టెస్లా ప్రగతి కోసమే పాటు పడ్డారు ఎలాన్ మస్క్.

మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఓటమికి గురించిన భయాలను వీడి మీ మొత్తం సమయాన్ని, కష్టాన్ని విజయ సాధన కోసం వెచ్చించినట్లయితే, విజయం తప్పక మిమ్మల్నే వరిస్తుంది అంటారు ఎలాన్ మస్క్.

7. మీ సమయాన్ని , ధనాన్ని ప్రకటనల మీద కాకుండా మీ ప్రోడక్ట్ క్వాలిటీని పెంచడంలో ఇన్వెస్ట్ చెయ్యండి:

టెస్లా కంపెనీ ఇప్పటివరకు ప్రకటనల(Advertising) కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు.దానికి బదులుగా R&D మరియు డిజైన్లలో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సాధించింది. దాని ఫలితమే ఈరోజున మనం చూస్తున్న అద్భుతమయిన డిజైన్లతో కూడుకున్న టెస్లా కారులు. మనం క్వాలిటీ ప్రోడక్ట్ ని ఇస్తున్నప్పుడు అది ప్రజల ద్వారానే ప్రపంచానికి తెలిసిపోతుంది. దానికోసం ప్రకటనలు మీద ప్రత్యేకించి ఖర్చు పెట్టడం అనవసరం. మీరు క్వాలిటీని ఫాలో అవ్వండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది అంటారు ఎలాన్ మస్క్.

8. ఫిర్యాదులను అవకాశాలుగా చూడండి:

మన మీద కానీ, మన ప్రోడక్ట్ మీద కానీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే మనకి కోపం రావడం అనేది సహజం. ఎవరైనా మన ప్రోడక్ట్ మీద కంప్లైంట్ చేశారు అంటే దానిలో ఇంకా అభివృద్ధి పరిచే అంశం ఏదో ఉందనే గా దాని అర్ధం. అలా కంప్లంట్ చేసినప్పుడే మనలోని ఇన్నోవేటివ్ ఐడియాస్ బయటకి వస్తాయి అంటారు ఎలాన్ మస్క్.

ఉదాహరణకు ఈరోజుల్లో ఎక్కడ చూసినా ప్రజలు ట్రాఫిక్ మీద కంప్లైయింట్ చేసేవాల్లే. ఆ కంప్లైంట్ యొక్క పరిష్కార మార్గ ఫలితమే ఎలాన్ మస్క్ నిర్మించిన 'Boring company'. కాబట్టి ఫిర్యాదులను అవకాశాలుగా చూడటం అలవాటు చేసుకోండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+