ratan-tata-telugu

Be an Entrepreneur-Startup Motivation in Telugu

Be an Entrepreneur:

బాగా చదవాలి... మంచి ఉద్యోగం సంపాదించాలి... ఏ కష్టం లేకుండా సంతోషంగా బ్రతకాలి... ఇవి ఒకప్పటి యువత కలలు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. సొంతంగా ఏదైనా చెయ్యాలి... చిన్నదైనా సరే ఒక కంపెనీ ప్రారంభించాలి...Entreprenuer గా మారాలి. ఇవి ఇప్పటి యువకుల కోరికలు.

ప్రతిరోజు రొటీన్ గా 9 నుండి 5 వరకు జాబ్ చేస్తూ ... సోమవారం వస్తే బాధపడుతూ ... జీతం కోసం ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఇష్టం లేకపోయినా సరే ఉద్యోగం చేస్తున్నవారు మనలో చాలా మంది ఉన్నారు.

కొంతమంది మాత్రం ఈ బోరింగ్ జీవితానికి పరిమితం కాకుండా తమకంటూ ఒక సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకుని, మరో పది మందికి ఉపాధి చూపుతూ పైకి ఎదగాలన్న ఆలోచనతో "స్టార్ట్ అప్" లను మొదలుపెడుతున్నారు.

ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా ఆ ఎదుగుదల మీది కాదు. శ్రమ మీది, సమయం మీది, కానీ ఫలితం మాత్రం మరొకరికి చెందుతుంది.

"If you don't build your own dream someone else will hire you to help build theirs." - Tony Gaskins

మీరు మీ సొంత కలలను నిర్మించుకోకపోతే, వేరే వాళ్ళు వాళ్ళ కలలను నిర్మించుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు... పాతికేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు ఉద్యోగంలో ఇరుక్కుపోతాం. తీరా జీవితం చివరలో వెనక్కి తిరిగి చూసుకుంటే జాబ్ తప్ప మరేమి కనిపించదు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడే కొంచెం చొరవ తీసుకోండి. దైర్యంగా ఒక అడుగు ముందుకెయ్యండి. మహా అయితే నాలుగైదు ఓటములు ఎదురవుతాయి. వాటి ద్వారా ఎంతో విలువైన అనుభవం మనకు దక్కుతుంది.



యువకులుగా ఉన్నప్పుడే ఏమైనా చెయ్యగలరు. ఎందుకంటే ఈ సమయంలో మీకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉండరు. కుటుంబ బాధ్యతలు ఉండవు. కాబట్టి ఈ సమయంలో కొంచెం రిస్క్ తీసుకున్న పరవాలేదు. కానీ మీరు ఆలస్యం చేసే కొద్దీ మీ మీద బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి.

" ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్" అంటాడు Facebook వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్

కాబట్టి మీ బుర్రలో కూడా ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది. దానిని బయటకు తీయండి. ఆచరణలో పెట్టండి. అలాగని చెప్పి ఇప్పుడు మీకున్న బాధ్యతలన్నీ పక్కన పెట్టి, మీరు చేస్తున్న ఉద్యోగం వదిలెయ్యమని చెప్పట్లేదు. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీలో ఉన్న ఆలోచనలకి ప్రాణం పోయండి. మెల్ల మెల్లగా మీ కలలను నిర్మించుకోండి. గెలుపు, ఓటములు తరువాతి సంగతి. కనీసం మీరు అనుకున్నది చేశారనే ఆనందం అయిన మీకు మిగులుతుంది. ఓడిపోతే అనుభవజ్ఞులవుతారు .. గెలిస్తే నలుగురికి ఆదర్శమవుతారు.

Suggested Books:



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

     
ads
+