ratan-tata-telugu

డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? Demat Account ఎలా Open చెయ్యాలి?

What is Demat Account?

మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్(Stock Market) లో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే ముందు మనకు డీమ్యాట్ అకౌంట్(Demat Account) తప్పనిసరిగా ఉండాలి. అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? డీమ్యాట్ ఎలా open చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే మనకు డీమ్యాట్ అకౌంట్(Demat Account) మరియు ట్రేడింగ్ అకౌంట్(Trading Account) తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలా మంది ఈ డీమ్యాట్ అకౌంట్ కి ట్రేడింగ్ అకౌంట్ మధ్య తేడా తెలియక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి ? ఆ అకౌంట్ ఎలా ఓపెన్ చెయ్యాలి అనేది వివరంగా తెలుసుకుందాం.

ట్రేడింగ్ అకౌంట్ (Trading Account):
ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఉపయోగపడే అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే మనం మనకు కావాల్సిన సమయంలో కావాల్సిన ధర వద్ద షేర్ లను కొనవచ్చు లేదా అమ్మవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ (Demat Account):
మనం డబ్బుని బ్యాంకు లో ఎలా దాచుకుంటామో, అలాగే మనం కొన్న షేర్లను దాచుకునే అకౌంట్ నే డీమ్యాట్ అకౌంట్ అని అంటారు. దీనిలో మన షేర్ లన్ని కూడా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి. ఈ అకౌంట్ లో మన షేర్ లు మాత్రమే కాదు బాండ్ లు, మ్యూచువల్ ఫండ్స్, గవర్మెంట్ సెక్యూరిటీస్ అన్ని భద్రపరచుకోవచ్చు.

ఇంతకు ముందు రోజుల్లో మనం ఏవైనా షేర్లను కొంటె వాటికి సంబందించిన పేపర్ లు, ఫారాలు , సర్టిఫికెట్లు ఇలా ఎన్నింటినో భద్రపరచుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇటువంటి పేపర్స్ ఏమి లేకుండా మొత్తం ప్రక్రియ అంతా కూడా డిజిటల్ గా జరిగిపోతుంది. మన షేర్లు అన్ని కూడా డీమ్యాట్ అకౌంట్ లో భద్రపరచబడి ఉంటాయి

అంటే సులువుగా చెప్పాలంటే ,మనం షేర్లను కొనడం అమ్మడం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా చేస్తాము. ఆలా కొన్న షేర్లు డీమ్యాట్ అకౌంట్ లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి.

ఒకవేళ మీరు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటే రెండు వేరువేరుగా ఓపెన్ చెయ్యవలసి అవసరసం లేదు. రెండింటిని కలిపి ఒకేసారి ఓపెన్ చెయ్యవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి కావలసినవి:

1. వయసు 18 సంవత్సరాలు పైన ఉండాలి.

2. బ్యాంకు అకౌంట్ వివరాలు

3. ఆధార్ కార్డు నెంబర్

4. పాన్ కార్డు నెంబర్

డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేముందు గమనించవలసిన విషయాలు:

మనం షేర్ లు కొన్నప్పుడు లేదా అమ్మిన ప్రతి సారి కొంత బ్రోకరేజ్ చార్జెస్ చెల్లించవలసి ఉంటుంది. అయితే కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు కొంచెం ఎక్కువ చార్జెస్ వసూలు చేస్తాయి. కాబట్టి ఏ బ్రోకరేజ్ కంపెనీ అయితే తక్కువ చార్జెస్ తీసుకుంటారో చూసి అకౌంట్ ఓపెన్ చెయ్యడం వలన భవిష్యత్తులో మనం చాలా ఆదా చెయ్యవచు. అలాగే నమ్మకమైన మరియు మంచి బ్రోకరేజ్ కంపెనీ లో డీమ్యాట్ అకౌంట్ చెయ్యడం మంచిది.

మన దేశంలో Zerodha, Upstox, Angel Broking, ICICI Direct ఇలా ఎన్నో బ్రోకరేజ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో నమ్మకమైన మరియు తక్కువ బ్రోకరేజ్ చార్జెస్ తీసుకునే కంపెనీZerodha. ఒకవేళ మీరుZerodha లో అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. << Open a Demat Account >>

మీకు డైరెక్ట్ గా జీరోధ అకౌంట్ ఓపెనింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, ఈ మెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు మీరే స్వయంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా Zerodha వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చెయ్యడం లో సహాయం చేస్తారు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+