ratan-tata-telugu

Dividend in Telugu - డివిడెండ్ అంటే ఏమిటి?

(DIVIDEND) డివిడెండ్ అంటే ఏమిటి?

(Dividend)డివిడెండ్: ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభల్లో కొంత భాగాన్ని ఆ కంపెనీ లో షేర్లు కలిగినటువంటి షేర్ హోల్డర్స్ (Share Holders) కి పంచుతుంది. వాటిని డివిడెండ్ (Dividend) అని అంటారు.

సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికి ఒకసారి గాని లేదా ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి గాని ప్రకటిస్తాయి . ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని కంపెనీ లు తమ త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) ప్రకటిస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే డివిడెండ్ ఇస్తున్నాయా లేదా ఇస్తే ఎంత శాతం డివిడెండ్ ఇస్తున్నాయి వంటి వివరాలు ప్రకటిస్తాయి.

అలాగే ప్రతిసారి ఒకే విధంగా డివిడెండ్ ఇవ్వాలని లేదు. ఆ కంపెనీ కి వచ్చిన లాభాలను బట్టి ఈ డివిడెండ్ (Dividend) ని ఇస్తాయి ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ ఇవ్వడం కూడా మానేస్తాయి.

అయితే అన్ని కంపెనీ లు కూడా ఈ డివిడెండ్ లు ఇవ్వవు కేవలం కొన్ని కంపెనీ లు మాత్రమే డివిడెండ్ ని ఇస్తాయి.

బాగా పేరు పొందిన పెద్ద పెద్ద కంపెనీలు తమకు వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్ గా ఇచ్చి మిగిలిన భాగాన్ని కంపెనీని మరింత విస్తరించడానికి ఖర్చుచేస్తాయి. కానీ కొత్తగా ఏర్పడిన కంపెనీలు, చిన్న కంపెనీ లు మాత్రం ఈ డివిడెండ్ ని ప్రకటించకుండా పూర్తి లాభాలను కంపెనీని మరింత అభివృద్ధి చెయ్యడానికి ఖర్చు చేస్తాయి.

చాలా మంది ఏ కంపెనీ అయితే ఎక్కువగా డివిడెండ్ ని ఇస్తాయో అటువంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. దాని వల్ల షేర్ ధర (Share Price) ఇంకా పెరుగుతుంది. కాబట్టి కంపెనీ లు ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడానికి డివిడెండ్ లు ప్రకటిస్తాయి. ఎంత శాతం డివిడెండ్ ఇవ్వాలి అనేది ఆ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ (Board of Directors) నిర్ణయిస్తారు.

డివిడెండ్స్ ని డబ్బు రూపంలో గాని లేదా షేర్ల రూపంలో గాని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా డబ్బు రూపంలోనే డివిడెండ్స్ ని ప్రకటిస్తారు. ఒకవేళ కంపెనీలు డివిడెండ్ ని ప్రకటిస్తే ఆ డబ్బు డైరెక్ట్ గా మన బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యిపోతుంది.

ఇలా డివిడెండ్స్ (Dividends) ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన షేర్ ధర పెరగడం వలన వచ్చే లాభాలతో పాటుగా ఈ డివిడెండ్ ను కూడా అదనంగా పొందవచ్చు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+