ratan-tata-telugu

ద్ర‌వ్యోల్బ‌ణం అంటే ఏమిటి? - Inflation in Telugu

Inflation:

Inflation:

ద్ర‌వ్యోల్బ‌ణం ఈ పదాన్ని తరచుగా టీవీ లలో, న్యూస్ పేపర్ లలో చూస్తూ ఉంటాం. ద్ర‌వ్యోల్బ‌ణం అంటే ఏమిటి? మన మీద మన ఆర్థిక వ్యవ్యస్థ మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ద్ర‌వ్యోల్బ‌ణం అంటే మనం రోజువారి వాడే వస్తువుల లేదా సేవల ధరలు పెరిగే రేటును ద్ర‌వ్యోల్బ‌ణం అని అంటారు. ఈ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని సాధారణంగా % శాతాలలో కొలుస్తారు. వస్తువుల డిమాండ్ పెరిగిపోవడం, సప్లై దగ్గడం వలన ఈ వస్తువుల ధరలు అనేవి పెరిగిపోతాయి. అదే ఈ inflation కి కారణం.

ఒకపుడు 5 రూపాయలు ఉండే వస్తువు ధర ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది దీనికి కారణం ఈ ద్ర‌వ్యోల్బ‌ణం. ప్రస్తుతం మన దేశం లో ఈ ద్ర‌వ్యోల్బ‌ణం అనేది 5% గా ఉంది. అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం వస్తువుల ధరలు సుమారుగా 5% పెరిగాయన్న మాట.

కానీ ఒక్కొక్కసారి ఈ ద్ర‌వ్యోల్బ‌ణం అనేది విపరీతంగా పెరిగిపోయి పరిస్థితి చెయ్యిదాటిపోతుంది. అలంటి దానికి ఒక ఉదాహరణ 2008లో జింబాబ్వే దేశంలో అన్ని వస్తువుల ధరలు ప్రతి 24 గంటలకు ఒకసారి డబల్ అవ్వడం జరిగింది. అలా విపరీతంగా పెరిగిపోయిన వస్తువులను కొనాలంటే ఎక్కువ డబ్బు కావాలి. దాని కోసం జింబాబ్వే ప్రభుత్వం ఎక్కువగా డబ్బుని ప్రింట్ చెయ్యడం మొదలుపెట్టింది.

అలా అక్కడి కరెన్సీ ప్రకారం దాదాపు ప్రతిఒక్కరు ట్రిలియనీర్ లు అయ్యిపోయారు. కానీ ఏమి లాభం వస్తువుల ధరలు బిలియన్ లలో ఉండేవి. చివరికి ఎలా తయారయ్యింది అంటే డబ్బులు ప్రింట్ చెయ్యడానికి కనీసం వాళ్ళ దగ్గర పేపర్ కూడా మిగలలేనంతగా అయ్యిపోయింది.

అలా జింబాంబ్వ్ లో 2008 సంవత్సరంలో ద్ర‌వ్యోల్బ‌ణం 1,12,00,000 % పెరిగింది అంటే అక్కడి వస్తువుల ధరల ఎంతలా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు.

మరి inflation (ద్ర‌వ్యోల్బ‌ణం) మంచిదికాదా అంటే అలా అని కూడా చెప్పలేము. కొద్ది కొద్దిగా ఈ వస్తువులపెరగడం అంటే ఈ ద్ర‌వ్యోల్బ‌ణం ఒక లిమిట్ లో పెరగడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ అది లిమిట్ దాటితే మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది.

వస్తువుల ధరలు పెరగడాన్ని Inflation అంటారు అలాగే వస్తువుల ధరలు తగ్గడాన్ని Deflation అని అంటారు. ఒకవేళ ప్రతి సంవత్సరం ఈ deflation పెరిగింది అనుకోండి అంటే వస్తువుల ధరలు విపరీతంగా తగ్గడం జరిగితే ప్రతి ఒక్కరు ఇప్పుడు వద్దులే తరువాత సంవత్సరం వస్తువుల ధరలు ఇంకా తగ్గుతాయి కదా కాబట్టి తరువాత కొనుక్కుందాంలే అని అనుకోవడంతో వస్తువుల కొనుగోళ్లు తగ్గిపోతాయి. దానితో వస్తువుల ధరలు తగ్గిపోతాయి. ఇలా ఎవరూ వస్తువులు కొనకపోతే కంపెనీలకు నష్టం వస్తుంది. ఆ నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగాలను తగ్గించడం, లేదా ఉన్నవాళ్లను ఉద్యోగం నుండి తొలగించడం చేస్తాయి.  ఇది కూడా దేశానికి మంచిది కాదు.  కాబట్టి దేశ ప్రభుత్వం ఈ inflation మరీ పెరిగిపోకుండా అలాగని మరీ తగ్గిపోకుండా క్రమబద్దీకరిస్తుంది.





You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+