ratan-tata-telugu

Stock Market Terms You Must Know in Telugu - Telugu badi

స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా వాడే పదాలు :

మనం Stock Market గురించి నేర్చుకునే క్రమంలో కొన్ని పదాలను ఎక్కువగా వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం . ఆ పదాలకు అర్ధం తెలుసుకుంటే నేర్చుకునే ప్రక్రియ సులభంగా ఉంటుంది . మరి స్టాక్ మార్కెట్ లో తప్పకుండా తెలుసుకోవలసిన పదాలేంటో ఇప్పుడు చూద్దాం .

Basic Stock Market Terms for Beginners:

బ్లూ చిప్ స్టాక్ (BlueChip Stocks) :

ఏదైనా కంపెనీ ఎప్పటి నుండో ఉండి, దాని మార్కెట్ క్యాపిటల్ వేల కోట్లలో ఉండాలి. అలాగే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినవాళ్ళకి లాభాలను , క్రమం తప్పకుండా డివిడెండ్ ని అందిస్తూ , నమ్మకం గా పనిచేస్తూ, దేశ విదేశాలలో విస్తరించి ఉన్న కంపెనీలకు సంబందించిన షేర్లను " బ్లూ చిప్ స్టాక్ " అని అంటారు. Reliance Industries, ITC, Infosys, TCS వంటి కంపెనీలను బ్లూ చిప్ స్టాక్స్ కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పెన్నీ స్టాక్స్ (Penny Stocks) :

ఒక కంపెనీ షేర్ ధర  10 రూపాయల లోపు ఉన్నా , లేదా ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్ల లోపు ఉన్నట్లయితే ఆ కంపెనీ షేర్లను పెన్నీ స్టాక్స్ అంటారు.

వాల్యూమ్  (Volume):

వాల్యూమ్ అంటే ఒక కంపెనీకి సంబందించిన షేర్లు ఒక రోజులో ఎన్ని ట్రేడ్ అయ్యాయో లేదా ఎన్ని షేర్లు చేతులు మారాయో అంటే ఎన్ని షేర్లు అమ్మడం కొనడం జరిగిందో దానిని వాల్యూమ్ (Volume) అని అంటారు. ఉదాహరానికి ఈ రోజు ఐటీసీ కంపెనీ చార్ట్ ని చూసినప్పుడు వాల్యూమ్ 1000000 అని ఉందనుకుందాం . దాని అర్ధం ఆ రోజు 10 లక్షల షేర్లు చేతులు మారాయి అని అర్ధం.

52 week high:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యధిక ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అత్యధిక ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

52 week low:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యల్ప ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అతి తక్కువ ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

All time high:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యధిక ధర (High Price) వరకు చేరుకుందో దానిని All time high అని అంటారు.

All time low:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యల్ప ధర (Low Price) వరకు చేరుకుందో దానిని All time low అని అంటారు.

ఇవి Stock Market లోకి ప్రవేశించాలనుకునేవారు తెలుసుకోవాల్సిన Basic Stock Market Terms.

#StockMarketTelugu



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+